Site icon HashtagU Telugu

supreme Court : సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

Justice Sanjeev Khanna sworn in as CJI

Justice Sanjeev Khanna sworn in as CJI

Justice Sanjiv Khanna : భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము స్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆ స్థానంలో ఇప్పుడు సంజీవ్ ఖన్నా ఆ బాధ్యతలను నిర్వహిస్తారు. జస్టివ్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐగా మాజీ సీజేఐ చంద్రచూడ్ స్వయంగా సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మే 13 వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. 1960, మే 14న జన్మించిన ఆయన 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా, 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఈ ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ను మంజూరు చేశారు. మొత్తం 6 ఏళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వామిగా ఉన్నారు. ఇక.. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ సహా తదితరులు హాజరయ్యారు.

ఇకపోతే.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గడిచిన రెండేండ్ల పాటు సీజీఐగా పనిచేసిన పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. అయోధ్య జన్మభూమి వివాదం, ఆర్టికల్‌ 370 రద్దు, స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం వంటి తీర్పులలో భాగస్వామి కావడమే కాక, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 38 రాజ్యాంగ ధర్మాసనాలలో ప్రాతినిధ్యం వహించారు. సుప్రీంకోర్టులో 500కు పైగా తీర్పులు ఇచ్చారు. ఒక్క తీర్పులలోనే కాక, న్యాయ విభాగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు కళ్లకు గంతలతో ఉన్న న్యాయదేవత స్థానంలో ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో రాజ్యాంగం చేతబట్టిన కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.

Read Also: AP Budget: ఏపీ బ‌డ్జెట్ రూ. 2.94 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా!