Kavitha : కవిత బెయిల్‌ పిటిషన్‌ పై మరోసారి తీర్పు వాయిదా

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 11:25 AM IST

BRS MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు(Delhi liquor scam case)లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్న కవిత..తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసులో మరోసారి బెయిల్ పిటిషన్‌(Bail Petition)పై తీర్పు వాయిదా పడింది. తీర్పును ఈనెల 6కిన్యాయమూర్తి వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, కవిత బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Read Also: Maneka Gandhi Assets : మేనకాగాంధీ ఆస్తి రూ.97 కోట్లు.. ఐదేళ్లలో డబుల్

తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అటు కవిత తరఫున వాదనలు కూడా విన్న న్యాయస్థానం.. నేడు (గురువారం) తీర్పు వెలువరిస్తుందని భావించగా మరోసారి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.