Kangana Ranaut : జయాబచ్చన్‌ పేరు వివాదం..ఇది చాలా చిన్న విషయం: కంగన

ఇది చాలా చిన్న విషయం అన్నారు. జయాబచ్చన్‌ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టారు. స్త్రీ-పురుషుడు కలిస్తేనే ఒక జీవితం అందంగా ఉంటుందని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందన్నారు.

Published By: HashtagU Telugu Desk
Jaya Bachchan name controversy..it's a very small matter..Kangana

Jaya Bachchan name controversy..it's a very small matter..Kangana

Kangana Ranaut: ఇటీవల పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ పేరుపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని ఉద్దేశించిన నటి, ఎంపీ కంగనా రనౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న విషయం అన్నారు. జయాబచ్చన్‌ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టారు. స్త్రీ-పురుషుడు కలిస్తేనే ఒక జీవితం అందంగా ఉంటుందని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

”ఇది అవమానకర విషయం. స్త్రీ, పురుషుల మధ్య అందమైన వ్యత్యాసాన్ని ప్రకృతి సృష్టించింది. దానిని కొందరు వివక్షగా చూస్తున్నారు. స్త్రీ, పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుంది. పార్లమెంట్‌ వేదికగా పేరు విషయంలో నెలకొన్న వివాదం చాలా చిన్న విషయం” అని కంగన తెలిపారు. అనంతరం జయాబచ్చన్‌ వైఖరిని తప్పుబడుతూ.. ”ఈవిధమైన అహంకార వైఖరి ఉంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న బంధంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. మనుషులెప్పుడూ ఒకరికొకరు కలిసిఉండాలి. ఇలాంటి కఠిన వైఖరితో వారిని విడదీయకూడదు. మన పేరు వెనక మరో వ్యక్తి పేరు వచ్చి చేరినంతనే కొంతమంది కోపానికి గురవుతున్నారు. తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అంతమాత్రానికే తమ గుర్తింపుపోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాంటివారిని చూసినప్పుడు నాకు బాధగా (వ్యంగ్యంగా) ఉంటుంది” అని పేర్కొన్నారు.

Read Also: Snoring Tips : గురక సమస్య పరిష్కారానికి ఏం చేయాలి..?

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌.. జయా బచ్చన్‌ను.. ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అని సంబోధించారు. దీనిపై జయా బచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జయా బచ్చన్‌ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అని డిప్యూటీ ఛైర్మన్‌ చెప్పగా.. ‘మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ ఆ రోజు ఒకింత అసహనం వ్యక్తంచేశారు.

తన తదుపరి చిత్రం ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్‌లో కంగనా రనౌత్‌ బిజీగా పాల్గొంటున్నారు. ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని దీనిని రూపొందించారు. కంగన స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. సెప్టెంబర్‌ 6న ఇది విడుదల కావాల్సిఉండగా.. సెన్సార్‌ సర్టిఫికేట్ ఇంకా రాకపోవడంతో రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Read Also: Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్‎కు ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

  Last Updated: 02 Sep 2024, 01:53 PM IST