Site icon HashtagU Telugu

Japanese Man : 12 ఏళ్లుగారోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్ర పోతున్నాడట..

Japanese Man Has Slept Just

Japanese Man Has Slept Just

మనిషికి నిద్ర (Sleep ) అనేది ఎంత అవసరమో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు సగటున కనీసం 6 నుండి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని డాక్టర్స్ చెపుతుంటారు. అయితే, జపాన్‌ (Japan )లోని ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడట..అలా నిద్రపోతుండడం వల్ల తన పనిని మరింత సమర్థంగా చేసుకోగలుగుతున్నానని చెపుతుండడం విశేషం. ఇంత తక్కువ సమయం నిద్రపోతున్నా తాను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, పనిలో ఉత్పాదకత కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

జపాన్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్‌కు చెందిన ఓ సంస్థ వ్యవస్థాపకుడు డైసుకే హోరీ (Daisuke Hori) (40 ). రోజు 30 నిమిషాలే నిద్రపోతున్నప్పటికీ తన శరీరం, మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని, ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే హోరి వెల్లడించాడు. ‘‘తినే ముందు లేదా తిన్న తరువాత స్పోర్ట్స్ డ్రింక్ లేదా కాఫీ తాగితే నిద్ర మత్తు అస్సలు ఉండదు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

గంటల కొద్దీ నిద్రకంటే కొద్దిసేపైనా నాణ్యమైన నిద్ర తీస్తే ఆరోగ్యానికి అసలైన మేలు కలుగుతుందని వివరించాడు. దీంతో, ఏకాగ్రత కూడా పెరుగుతుందని అన్నాడు. ‘‘జీవితంలో లక్ష్యంపైనే దృష్టి పెట్టాలనుకునే వారు ఈ విధానంతో ఎక్కువ లాభపడతారు. ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రే ఉపయోగకరం. ఉదాహరణకు డాక్టర్లు, ఫైర్‌ఫైటర్లు తక్కువ సేపు నిద్రపోయినా వారి పని ఉత్పాదకత మాత్రం ఉత్కృష్టరీతిలో ఉంటుంది’’ అని తెలిపాడు. అతడు చెబుతున్న విషయాల్లో నిజానిజాలను ఓ జపాన్ రియాలిటీ టీవీ షోలో తేలాయి. ఈ షోలో పాల్గొన్న హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు. కానీ, సుదీర్ఘనిద్ర తీసిన వ్యక్తిలా ఎంతో ఉత్సాహంగా తన పని ప్రారంభించాడు. జిమ్‌కు కూడా వెళ్లాడు’’ అని షో నిర్వాహకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం డైసుకే హోరీ 2016లో ‘జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌’ను స్థాపించాడు. నిద్ర, ఆరోగ్యంపై పాఠాలు బోధిస్తున్నాడు. అల్ట్రా-షార్ట్ స్లీపర్‌లుగా మారేందుకు ఇప్పటివరకు 2,100 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాడు.

Read Also : Royal Enfield Classic 350 vs Jawa 350: రాయల్ ఎన్‌ఫీల్డ్-జావా 350.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?