Site icon HashtagU Telugu

Omar Abdullah : పాక్‌ దాడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: జమ్మూకశ్మీర్‌ సీఎం

Jammu and Kashmir CM announces Rs 10 lakh compensation for families of those killed in Pak attack

Jammu and Kashmir CM announces Rs 10 lakh compensation for families of those killed in Pak attack

Omar Abdullah : జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్‌ సైన్యం జరుపుతున్న ఉగ్రదాడుల్లో ఇప్పటివరకు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు అధికారిక సమాచారం. ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: India Pakistan War: భార‌త్‌తో యుద్ధం.. భ‌య‌ప‌డిన పాక్ రిటైర్డ్ సైనిక అధికారి!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు పాక్‌ ఉగ్రస్థావరాలపై విజయవంతమైన దాడులు జరపడంతో, పాకిస్తాన్‌ తన చర్యలను మళ్లీ వేగవంతం చేసింది. నియంత్రణ రేఖను ఉల్లంఘిస్తూ రాజౌరి, పూంఛ్‌, శ్రీనగర్‌, పఠాన్‌ కోట్‌ ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి పాక్‌ కాల్పులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి రాజ్‌కుమార్‌ థప్పా కూడా మరణించడం తీవ్ర విషాదానికి దారి తీసింది.

“నిన్నటికి నన్ను తాను అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఒకరోజు లోపే ఆయన్ని కోల్పోవడం నేను మరిచిపోలేను,” అంటూ సీఎం ఒమర్‌ భావోద్వేగంగా స్పందించారు. శనివారం వేకువజామున కూడా పాక్‌ సైన్యం మరింత ఉగ్రంగా దాడులు ప్రారంభించగా, సరిహద్దు గ్రామాల్లో బాంబుపేలుళ్ల ధ్వని వినిపించడంతో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపి బ్లాకౌట్‌ ప్రకటించారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి సైరన్లు మోగించడంతో ప్రజలు శరణార్థ శిబిరాల్లోకి తరలించబడ్డారు. మధ్యాహ్నం సమయంలో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే భారత భద్రతా దళాలు పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని అధికార వర్గాలు తెలిపాయి.

Read Also: Papaya: బొప్పాయిలో ఇది కలుపుకొని తింటే చాలు.. ఈజీగా బరువు తగ్గడం ఖాయం!