Jagan: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. తాజాగా వంశీతో ములాఖత్ కావడానికి వైఎస్ జగన్ జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు.
Read Also: Bangladesh : తిరిగి వస్తా..పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా: షేక్ హసీనా
ములాఖత్ ద్వారా వంశీని కలిశారు. ఆయనను పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజ శ్రీ కూడా ఉన్నారు. జైలు వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను, కొందరు నేతలను మాత్రమే జైలు వరకు అనుమతించారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.
మరోవైపు రాజకీయ విభేదాలతోనే తనను లక్ష్యంగా చేసుకొని ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ. అయితే వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్టీ, ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా పోలీసులు నోటీసులు కూడా పంపించారు. జైలులో వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
Read Also: MGNREGA Workers : ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త