Site icon HashtagU Telugu

CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

Invitation to CM Revanth Reddy for Bhadrakali Sharan Navaratri celebrations

Invitation to CM Revanth Reddy for Bhadrakali Sharan Navaratri celebrations

Bhadrakali devi sharannavaratri festival: వరంగల్‌ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ పాలక మండలి సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.

Read Also: IND vs BAN 2nd Test Day1: వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ రద్దు

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, వరంగల్‌లో జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం సీఎంకు భద్రకాళీ దేవి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ శేషు, ఈవో శేషుభారతి సహా ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Read Also: Tirumala Laddu Issue : అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం