Site icon HashtagU Telugu

Intel : 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్‌

Intel lays off 15,000 employees

Intel lays off 15,000 employees

Intel: చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని నివేదికల ప్రకారం, ఇంటెల్‌ తన నూతన తొలగింపులో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో 15 శాతం భారీ కొత విధించింది. దీని కారణంగా కంపెనీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దశాబ్దాలలో ఇదే అతిపెద్ద తొలగింపుగా చెప్పవచ్చు. చిప్‌ ల తయారీ కంపెనీ ఇంటెల్ ప్రస్తుతం 1.10 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇంటెల్ తన ఖర్చులను పెద్ద ఎత్తున తగ్గించాలనుకుంటోంది. అందుకే వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక నుండి కంపెనీ 2025లో సుమారు రూ. 837 బిలియన్లు వరకు ఆదా చేస్తుందని అంచనా. ఉద్యోగాల కోత ప్రకటన తర్వాత కేవలం గంటల తర్వాత ట్రేడింగ్‌లో ఇంటెల్ షేర్లు 20 శాతానికి పైగా పడిపోయాయి. ఇంటెల్ తన ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు . 2016లో ఇంటెల్ ఒక ప్రధాన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ ఇంతకుముందు అక్టోబర్, 2022 నుండి డిసెంబర్ 2023 వరకు మరో 5 శాతం ఉద్యోగులను తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ తన సేల్స్, మార్కెటింగ్ టీమ్‌ లోని ఉద్యోగులను తొలగించింది.

Read Also: UP Girl Suicide: ఆర్మీలో చేరాలనుకుంది, హైట్ లేకపోవడంతో ఆత్మహత్య