Site icon HashtagU Telugu

16 New Years – 1 Day : అక్కడ ఒక్కరోజే 16సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎందుకు ?

16 New Years 1 Day

16 New Years 1 Day

16 New Years – 1 Day : మనం ఇవాళ భూమిపై న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్‌గా చేసుకుంటున్నాం. కానీ ఆకాశంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈ ఒక్కరోజే  16సార్లు న్యూ ఇయర్ వేడుకలను చేసుకునే వీలుంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే!! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. దాదాపు 90కిపైగా ప్రపంచ దేశాల ఎగువన అంతరిక్షంలోని నిర్దిష్ట కక్ష్యలో ఉంది. ఇది ప్రతీ 90 నిమిషాలకు ఒకసారి భూమి మొత్తాన్ని ప్రదక్షిణ చేస్తుంటుంది. ఇంత స్పీడులో తిరుగుతున్నందు వల్ల ప్రతిరోజూ 24 గంటల వ్యవధిలో ఐఎస్ఎస్‌లోని వ్యోమగాములు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తుంటారు. భూమిపై మనకు ప్రతిరోజు 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి ఉంటాయి. కానీ ఐఎస్ఎస్‌లో ప్రతి సూర్యోదయం 45 నిమిషాల పాటు, ప్రతి సూర్యాస్తమయం 45 నిమిషాలు పాటు కొనసాగుతాయి. ఈ లెక్కన అక్కడున్న ఏడుగురు వ్యోమగాములు ఇవాళ 16 సార్లు న్యూ ఇయర్ వేడుకలను(16 New Years – 1 Day) చేసుకునే వీలు ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: LIC Scholarship : పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాలర్‌పిప్స్.. లాస్ట్ డేట్ జనవరి 14