Site icon HashtagU Telugu

Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత

Kavitha

Kavitha

Kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఎలా లీక్‌ అయిందని కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్‌ సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్‌ ఉండాలని కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీపై మాట్లాడాలి కానీ.. నాపై దాడి చేస్తే ఎలా? అన్నారు.

Read Also: Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ

కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా?ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్‌ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. భారాసలో కేసీఆర్‌ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. బీఆర్‌ఎస్‌ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. భాజపాలో భారాస విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు?.. అంత సీన్‌ లేదు అని కవిత అన్నారు.

నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్‌ నీడన తప్ప.. చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశం వెలుపల ఐటీ సెల్‌లు పెట్టి నాపై పోరాడుతామంటే ఎలా?దొంగల్ని పట్టుకోమంటే చేతగాక నాపై ప్రతాపం చూపితే ఎలా? పార్టీ నాది అని ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుంది. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే.. కేవలం ఎక్స్‌లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలా? నేను ఏనాడూ పదవుల కోసం పోరాడలేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశాను అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు వస్తే, కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తప్పించుకోవడం కాదని, పార్టీ నేతలు సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

Read Also: Gaddar Film Awards : ‘గద్దర్‌’ అవార్డుల ప్రకటన..ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌..