Ayodhya kissing wife : మీ సరసం తగలెయ్యా…నదిలో భార్యకు ముద్దు…ఉతికారేసిన జనం..!!

నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను జనం పిచ్చకొట్టుడు కొట్టారు. భార్యముందే భర్తకు నాలుగు మొట్టికాయలు తగిలించారు.

Published By: HashtagU Telugu Desk
Husband Kissed Wife

Husband Kissed Wife

నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను జనం పిచ్చకొట్టుడు కొట్టారు. భార్యముందే భర్తకు నాలుగు మొట్టికాయలు తగిలించారు. కట్టుకున్న భార్యకు ముద్దు పెట్టడంలో తప్పేంముందనే కదా మీ డౌట్. అసం జరిగిందో చదవండి..!! కట్టుకున్న భార్యకు కాకుండా మరో మహిళకు ముద్దు పెడితే తప్పుకానీ…భార్య ముద్దు పెడితే తప్పేంటి. అసలు మ్యాటర్ చదవండి..!!

అయోధ్యలోని సరయు నదిలో ముద్దు పెట్టుకున్న భర్తను జనంగా మామూలుగా కొట్టలేదు. భార్యముందే భర్తకు లాగి లెంపకాయలేసారు. సరయూ నదిలో చాలామంది పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అదే సమయంలో ఓ జంట స్నానం చేసేందుకు నదిలోకి దిగింది. ఆ జంటకు సడెన్ గా ఆలోచన ఎందుకు వచ్చిందోకానీ అంతా చూస్తుండగానే ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఇలా చేయడంతో వారు ఎంత ఆనందాన్ని పొందారో తెలియదు కానీ..చుట్టుపక్కల వాళ్లకు మాత్రం పిచ్చ కోపం వచ్చింది. ఆ జంట చర్యతో వారికి మండింది. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటారా…అంటూ భర్తను ఉతికారేసారు. దీంతో ఆ జంట బిత్తరపోయి చూడటం తప్పా ఏం చేయలేదు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. భార్య ఎంత బతిమిలాడినా…జనాలు భర్తను విడిచిపెట్టకుండా కొట్టారు. పాపం ఆ జంట ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయినా వాళ్ల పిచ్చి కాకుంటే ముద్దు పెట్టుకోవడానికి పబ్లిక్ ప్లేస్ అందులోనూ పుణ్యక్షేత్రమే దొరికిందా…మీ సరసం తగలెయ్యా అంటూ నెటిజన్లు పిచ్చ కామెంట్లు చేస్తున్నారు.

  Last Updated: 23 Jun 2022, 08:44 AM IST