97000 Indians Arrested : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ అరెస్టయ్యే భారతీయులు సంఖ్య గత మూడేళ్లలో భారీగా పెరిగింది. ప్రత్యేకించి గత ఏడాది వ్యవధిలో(2022 అక్టోబరు – 2023 సెప్టెంబరు) ఇప్పటివరకు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తూ 97వేల మంది భారతీయులు అరెస్టయ్యారు. ఈవిషయాన్ని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూసీబీపీ) విభాగం అధికారులు వెల్లడించారు. 2019-20లో 19,883 మంది, 2020-21లో 30,662 మంది, 2021-22 మధ్య 63,927 మంది ఈవిధంగానే అరెస్టయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ గణాంకాలను బట్టి అమెరికాలోకి అక్రమంగా ఎంటరయ్యేందుకు యత్నించే భారతీయుల సంఖ్య ఏవిధంగా పెరుగుతూపోతోందో అర్థం చేసుకోవచ్చు. 2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు మధ్యకాలంలో 96,917 మంది భారతీయులు అరెస్టవగా.. వీరిలో 30,010 మందిని కెనడా బార్డర్‌లో, 41,770 మందిని మెక్సికో బార్డర్‌లో అరెస్టు చేశారు. వీరంతా ఫ్రాన్స్ నుంచి మెక్సికోకు చేరుకుని అక్కడి నుంచి బస్సులను అద్దెకు తీసుకుని అమెరికా సరిహద్దులకు చేరుకుంటున్నట్లు (97000 Indians Arrested) గుర్తించారు.