Weekly Horoscope: ఈవారం రాశి ఫలితాలు.. వారికి శత్రువులు మిత్రులవుతారు

Weekly Horoscope: మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 20 నుంచి 26 వరకు) రాశి ఫలితాలు ఇవీ..  

Published By: HashtagU Telugu Desk
Weekly Horoscope 2024 december 9 to 15

Weekly Horoscope: మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 20 నుంచి 26 వరకు) రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈవారం మేషరాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీపై ఆరోపణలు వస్తాయి. అధికారులతో ఇబ్బందులుంటాయి. ఖర్చులు పెరిగే అవకాశముంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్యం నెరవేరే వరకూ పోరాడాలి. బంధుమిత్రుల సహకారంలో ఒక పనిని పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఏవైనా విభేదాలు ఉంటే సమసిపోతాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి. చేపలకు ఆహారం వేయండి.

వృషభ రాశి

ఈవారం వృషభ రాశి వారు కొన్ని ప్రతికూల వార్తలు వినాల్సి రావొచ్చు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ తగ్గుతుంది. అతికష్టం మీద పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఇంకొంతకాలం నిరాశ తప్పదు. మోసం చేసేవారున్నారు.  నష్టాలు వాటిల్లకుండా జాగ్రత్త పడండి. వినాయకుడికి మోదకం సమర్పించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథునం

ఈవారం మిథునరాశి వారు రుణబాధలు కలగకుండా జాగ్రత్తపడాలి. ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మిత్రుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి.  ఎన్ని ఇబ్బందులు ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా ముందడుగు వేసేందుకు చాలా అవకాశాలు పొందుతారు. హనుమాన్ చాలీసా పఠించండి. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటకం

ఈవారం కర్కాటక రాశి వారికి నిందలు పడాల్సిన పరిస్థితులున్నాయి. ధైర్యంగా వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. ఎవ్వరికీ హాని తలపెట్టవద్దు. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకొవద్దు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కలహాలతో కాలాన్ని వృథా చేయకండి. ఆత్మీయుల సూచనలు తప్పనిసరి. విద్యార్థులకు చదువుపై కాకుండా ఇతర విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. గణపతిని ధ్యానించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహం

ఈవారం సింహరాశి వారు ముఖ్య పనులు వాయిదా వేయడం మంచిది. శ్రమ అధికం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చెడు సావాసాలు మంచిది కాదు. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి. గాయపడే ప్రమాదం ఉంది. బయటి పనుల వల్ల నిరంతరం మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఆకస్మిక టెన్షన్ పెరగుతుంది. శివుడిని దర్శించుకోండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి.

కన్య (Weekly Horoscope)

ఈవారం కన్యారాశి వారు ఏ ప్రణాళికలు వేసుకున్నా విజయవంతం అవుతాయి. ఉపాధి కోసం చూస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. మంచి ఉద్యోగంలో కుదురుకుంటారు. ఆర్థికంగా ఉత్తమమైన సమయం. ఆస్తిని వృద్ధి చేస్తారు. వ్యాపారులు బిజీ బిజీగా ఉంటారు. మీ నిజాయితీ నలుగురికీ ఆదర్శం అవుతుంది. పక్షులకు ఆహారం వేయండి. శివారాధన మంచిది. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి.

Also read: Hyper Aadi : హైపర్ ఆది ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు.. తన ఎంట్రీకి పవన్ కళ్యాణ్ సినిమా హెల్ప్ అయ్యిందా..?

తుల

ఈవారం తులారాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. వ్యాపారం పరిధి పెరుగుతుంది. మంచి ఆశయంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. హనుమంతుడిని దర్శించుకోండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చికం

ఈవారం వృశ్చిక రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు వాహనం జాగ్రత్తగా నడపండి. ప్రమాద సూచనలున్నాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కానీ చిన్నచిన్న సమస్యలు తలెత్తుతాయి. ఆటంకాలు ఉన్నా మిమ్మల్ని బాధించవు. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. లక్ష్మీదేవిని పూజించండి.

ధనుస్సు

ఈవారం ధనుస్సు రాశి వారు అనవసర పరుగులు తీయొద్దు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఎవ్వరితోనూ వాగ్వాదానికి దిగొద్దు. పనులను వాయిదా వేయరాదు. వ్యాపారంలో సమస్యలు మానసికంగా కృంగిపోయేలా చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది.  ఈవారం ఆరంభంలో కన్నా చివర్లో బాగానే ఉంటుంది. గణేశుడికి గరిక సమర్పించండి. సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈవారం మకర రాశి వారు కోపం తగ్గించుకోవాలి. ఇబ్బందులు పెట్టే వారున్నారు. ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్య లేదు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. వ్యాపారపరంగా తిరుగులేని కాలం. పేదలకు ఆహారం అందించండి. శివారాధన శుభప్రదం. శనికి తైలాభిషేకం చేసుకోవడం.

కుంభం

ఈవారం చివరిలో కుంభరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. కానీ వాటిని తేలికగానే అధిగమిస్తారు. మీరు చేసే ప్రతీ పని ఆలోచించి చేయాలి. ఇంట్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. వాదనలకు, గొడవలకు సమయం కాదు. విశ్రాంతి అవసరం. ఖర్చులు పెరుగుతాయి. శుభవార్త వింటారు. దైవబలం రక్షిస్తుంది. అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగాలి. శివుడిని దర్శించుకోండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీనం 

ఈవారం మీన రాశి వారు తెలియని వ్యక్తులను నమ్మవద్దు. మీలో ఏదో ఆందోళన ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టబడులు పెట్టేందుకు ఇంకొంత కాలం ఆగితే మంచిది. శత్రువులు మిత్రులవుతారు. భూ, గృహ యోగాలున్నాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. హనుమాన్ స్తోత్రం పఠించండి. దక్షిణామూర్తిని పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
  Last Updated: 20 Aug 2023, 07:49 AM IST