Site icon HashtagU Telugu

Sengol History : ‘సెంగోల్’ రాజదండం.. థ్రిల్లింగ్ హిస్టరీ

Sengol History

Sengol History

మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర  ‘సెంగోల్’ రాజదండం (Sengol History) ఏర్పాటు కాబోతోంది. మే 28న స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని అక్కడ ప్రతిష్టించబోతున్నారు. ఈ తరుణంలో ‘సెంగోల్’ రాజదండం(Sengol History) ఎక్కడిది ? ఎవరిది ? ఎలా తయారు చేశారు ? ఎవరు తయారు చేశారు ? దాన్ని ఇప్పుడు పార్లమెంటులో పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. మనం అందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాలను తెలుసుకుందాం..  

బ్యాక్ టు 1947..

‘సెంగోల్’ రాజదండం గురించి తెలుసుకోవాలంటే 1947 సంవత్సరంలోకి వెళ్ళాలి . మన దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి బ్రిటీష్ వాళ్ళు రెడీ అయ్యారు. ఈక్రమంలో ఇండియా తొలి ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇటువంటి టైంలో బ్రిటీష్ ఇండియా  చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ , జవహర్ లాల్ నెహ్రూ ఒక  టాపిక్ పై మాట్లాడుకున్నారు. ” మేం మీకు స్వాతంత్య్రం ఇస్తున్నాం కదా.. అధికారం మా  నుంచి మీకు బదిలీ అవుతోంది.. దీన్ని ప్రతిబించేలా ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది” అని నెహ్రూ తో  లార్డ్ మౌంట్ బాటన్  చెప్పారు. ఆ తర్వాత నెహ్రూ దీని గురించి తన సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన సీ. రాజగోపాలాచారితో చర్చించారు. బ్రిటీష్ వారి నుంచి అధికారం బదిలీకి చిహ్నంగా ఏం చేయొచ్చు అని అడిగారు. “కొత్తగా రాజు అయ్యే వారు.. తమ రాజ గురువు  చేతుల మీదుగా రాజ దండాన్ని అందుకోవడం సంప్రదాయం. మనం కూడా అలా చేయొచ్చు” అని నెహ్రూకు సీ. రాజగోపాలాచారి సలహా ఇచ్చారు. ఈ ప్రపోజల్ నచ్చడంతో వెంటనే నెహ్రూ ఓకే చెప్పారు.

Also read : New Parliament Photos : కొత్త పార్లమెంట్ అదుర్స్.. ఓ లుక్కేయండి

ప్రభుత్వం తరఫున ప్రత్యేక విమానంలో రాజదండం..

ఆ వెంటనే  1947 జులైలో రాజగోపాలాచారి తమిళనాడులో ఉన్న 14వ శతాబ్దం నాటి మఠం “తిరువడుత్తురై ఆధీనం”కు వెళ్లి .. ఒక స్పెషల్ రాజదండం తయారు  చేయించమని కోరారు. అప్పట్లో మద్రాసులోని ఒక స్వర్ణకారునితో ఈ బంగారు రాజ దండాన్ని “తిరువడుత్తురై ఆధీనం” మఠం నిర్వాహకులు తయారు చేయించారు. దానికి ‘సెంగోల్’ అని పేరు పెట్టారు. తమిళ పదం “సెమ్మై” నుంచి “సెంగోల్” అనే పదం వచ్చింది. దీని అర్థం “ధర్మం”.  ఈ రాజ దండం పై భాగంలో నది ప్రతిమ ఉంటుంది. రాజదండాన్ని ఢిల్లీకి తీసుకొని రావడానికి.. ప్రభుత్వం తరఫున ప్రత్యేక విమానాన్ని చెన్నైకి పంపారు. ఆ విమానంలో కూర్చొని “తిరువడుత్తురై ఆధీనం” మఠం నిర్వాహకులు రాజ దండాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు.

Also read : Opposition Boycott : పార్లమెంట్ ప్రారంభోత్సవం బైకాట్..విపక్షాలు ఏకం

1947 ఆగష్టు 14న రాత్రి 11.45 గంటలకు..

1947 ఆగష్టు 14న భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని నిమిషాల ముందు సుమారు 11.45 గంటలకు.. మఠం ప్రతినిధి బృందం నెహ్రూకు ‘సెంగోల్’ రాజదండం అందించింది. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లార్డ్ మౌంట్ బాటన్ ఆ రాజదండాన్ని “తిరువడుత్తురై ఆధీనం” మఠం ప్రతినిధి శ్రీ ల శ్రీ కుమారస్వామి తంబిరాన్ కు ఇచ్చారు. అనంతరం శ్రీ ల శ్రీ కుమారస్వామి తంబిరాన్ దానిపై పవిత్ర జలం చల్లి.. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి అందజేశారు. ఈసందర్భంగా నెహ్రూకు పూలమాల వేసి నుదుటిపై బూడిద పోశారు. అందుకే ఇప్పుడు ‘సెంగోల్’ రాజదండాన్ని పార్లమెంట్ లో ప్రతిష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది .