Site icon HashtagU Telugu

Trumps Mug Shot : డొనాల్డ్ ట్రంప్ ఖైదీ నంబర్ ‘P01135809’.. జైలులో దిగిన ‘మగ్ షాట్’ ఫొటో వైరల్

Trumps Mug Shot

Trumps Mug Shot

Trumps Mug Shot :  మీరు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు చెందిన వందలాది ఫొటోలను చూసి ఉండొచ్చు.. 

ఈ ఫొటో అలాంటిది కాదు.. ఇది వెరీ డిఫరెంట్..  

గురువారం రాత్రి ఫుల్టన్ కౌంటీ జైలులో ఉండగా పోలీసులు తీసిన ట్రంప్  ఫొటో ఇది. 

దీన్ని ‘మగ్ షాట్‌’ రకం ఫొటో అంటారు. 

పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్ మగ్ షాట్ ఫొటో వైరల్ అవుతోంది.

Also read : Today Horoscope : ఆగస్టు 25 శుక్రవారం రాశి ఫలితాలు.. వారి డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు

కోపంగా, కసిగా, ఫ్రస్ట్రేషన్ తో కెమెరా వైపు చూస్తున్న అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ను మనం ఈ మగ్ షాట్ ఫొటోలో చూడొచ్చు.  ఆయన జుట్టు  జైల్‌లోని లైటింగ్‌లో మెరిసిపోతోంది.  ఆయనకున్న కసి కళ్లలో కొట్టొచ్చినట్టు  కనిపిస్తోంది. ఆయన విసుక్కుంటున్న తీరును..  నోరు ప్రతిబింబిస్తోంది. తన పరిస్థితి ఇలా అయ్యిందనేలా.. కెమెరా వైపు కోపంగా ట్రంప్ చూడటం ఈ ఫొటోలో  స్పష్టంగా ఉంటుంది.

Also read : Prize Money: చెస్ ప్రపంచ కప్‌ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానందకి ప్రైజ్ మనీ ఎంతంటే..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను నేరాభియోగాలు వదలడం లేదు.  కోర్టులు, జైళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తాజాగా గురువారం రాత్రి ఆయన జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలు దగ్గర పోలీసులకు లొంగిపోయారు. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసుల్లో కోర్టు ఆర్డర్స్ ను పాటిస్తూ పోలీసులకు ట్రంప్ సరెండర్ అయ్యారు. అక్కడ ట్రంప్ ను పోలీసులు ఫార్మాల్టీ ప్రకారం అరెస్టు చేసి, జైలులోకి తీసుకెళ్లారు. జైలులో ఆయన 20 నిమిషాలు గడిపారు. ట్రంప్ కు ‘P01135809’ ఖైదీగా నంబర్ కేటాయించారు. ఆ వెంటనే  బెయిల్ వచ్చింది. రూ.1.65 కోట్ల పూచీకత్తుపై ట్రంప్ కు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఫాని విల్లీస్‌ బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చేశారు. ట్రంప్‌పై ఇలా మొత్తం నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. తనపై నమోదైన కేసులన్నీ కుట్రపూరితమైనవని, తాను ఏ తప్పూ చెయ్యలేదని ట్రంప్ అంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన మరో కేసులో ట్రంప్‌ అరెస్టయి, బెయిల్‌పై విడుదలయ్యారు. ఇలా ఈ కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ 2024లో జరిగే ఎన్నికల్లో  ట్రంప్ అధ్యక్షుడైతే.. ఆయనపై ఉన్న కేసులు పెండింగ్‌లో పడిపోయే అవకాశాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు.