Hyd : ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు..

Uppal Stadium: నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌(Sunrisers), గుజరాత్‌(Gujarat) మ్యాచ్‌(match) జరుగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రత(Heavy security)ను పోలీసులు ఏర్పాటు చేశారు. 2800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. We’re now on WhatsApp. Click to Join. సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికే […]

Published By: HashtagU Telugu Desk
South Africa Cricketer

South Africa Cricketer

Uppal Stadium: నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌(Sunrisers), గుజరాత్‌(Gujarat) మ్యాచ్‌(match) జరుగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రత(Heavy security)ను పోలీసులు ఏర్పాటు చేశారు. 2800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికే మొత్తం టికెట్స్ అమ్ముడుపోయాయి. తమ అభిమాన క్రికెటర్లని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు క్యూ కట్టనున్నారు.

Read Also: Janhvi Kapoor : జాన్వికి అలాంటి వాడు భర్తగా కావాలట.. దేవర బ్యూటీ కోరికలు బాగానే ఉన్నాయ్..!

స్టేడియం మొత్తం ఫుల్ అయ్యే అవకాశం ఉంది. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక పార్కింగ్ సదూపాయలు కల్పించింది. ఐపీఎల్17లో విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్తుపై గురి పెట్టింది. ఇప్పటికే రేసు నుంచి వైదొలిగిన గుజరాత్ జెయింట్స్ మ్యాచ్లో గెలిచి నాకౌట్ చేరుకోవాలని ఆశిస్తోంది. సొంతగడ్డపై గత పోరులో లక్నోను పది వికెట్లతో చిత్తు చేసిన రైజర్స్ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. రైజర్స్ ప్రస్తుతం 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో నాలుగో ప్లేస్లో ఉంది. చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే టాప్-2కు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ పోరులోనూ భారీ విజయమే టార్గెట్గా బరిలోకి దిగనుంది.

  Last Updated: 16 May 2024, 11:16 AM IST