Telangana Police : బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వనపర్తి రైతు ప్రజా నిరసన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కొల్లాపూర్‌లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయంగా పాలన జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్ రావు.
సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా తనను రాజీనామా చేయమంటున్నారని పేర్కన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రేవంత్ వచ్చాక పాత పథకాలను ఆపేశారని.. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో ఎన్నో హామీలు ఇచ్చారని హరీశ్ రావు గుర్తుకు చేశారు.
రైతులను మోసం చేసిన నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. హామీలు అడిగితే బేగం బజార్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారని, నా మీద ఎన్ని కేసులు పెట్టినా హామీలు ఇచ్చేదాక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తానని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను రోడ్ల మీదకు తెచ్చారని, జివో 29(GO 29) తెచ్చి ఎస్సీ(SC), ఎస్టీ(ST) లకు ఉద్యోగాలు(Jobs) రాకుండా చేస్తున్నారని, అన్యాయం అంటే పిల్లల ఈపులు పగల కొడుతున్నారని తెలిపారు. పోలిసోల్లను నమ్మడం లేదని, స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారని, ముఖ్యమంత్రి(CM)గా సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్(Fail) అయ్యారని దుయ్యబట్టారు. ఇక అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశామని అన్నారు.
Read Also: Prasanth Varma: జై హనుమాన్ ఫస్ట్ లుక్ రేపే..