Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఆరుగురికి విముక్తి కల్పించేందుకు సిద్ధమైంది. అయితే, వారిని ఎప్పుడు బయటకు పంపిస్తారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 నెలలకు పైగా జరుగుతున్న భీకర పోరాటాన్ని పక్కనపెట్టి.. బందీలను, ఖైదీలను విడుదల ప్రక్రియను ప్రారంభించాయి. హమాస్ తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడతల వారిగా విడుదల చేస్తోంది.
Read Also: Kumbh Mela : మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోంది: యోగి
కాగా, ఖతర్,ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికిపైగా పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటివరకు 21 మంది ఖైదీలకు విముక్తి కల్పించింది.
ఇటీవల హమాస్ పంపించిన ఒక మృతదేహం తమ దేశానికి చెందిన మహిళది కాదని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే, ఆ మృతదేహం తమ కుమార్తెదేనంటూ మృతురాలి కుటుంబం తాజాగా ధ్రువీకరించడం గమనార్హం. షిరి బిబాస్ అనే మహిళ, తన ఇద్దరు చిన్నారులు హమాస్ చెరలో ఇన్నాళ్లూ బందీగా ఉన్నారు. యుద్ధం కారణంగా మహిళతో పాటు చిన్నారులు కూడా మృతి చెందారు. ఇటీవల ఆమె మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు పంపించారు. అయితే, అది అసలు తమ దేశ పౌరురాలిది కాదని.. ఫోరెన్సిక్ అధికారులు ధృవీకరించారని ఇజ్రాయెల్ తెలిపింది. నిజానికి అది పాలస్తీనాకు చెందిన మహిళ శవంగా గుర్తించినట్లు పేర్కొంది.
Read Also: APPSC : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..