Site icon HashtagU Telugu

Ariel Henry: హైతీ ప్రధాని అరియల్‌ హెన్రీ రాజీనామా

Haiti Prime Minister Ariel

Haiti Prime Minister Ariel

 

 

Ariel Henry:హైతీలో గత కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సాయుధ గ్యాంగులు(Armed gangs) ఆ దేశంలో రణరంగం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ దేశంలో శాంతిభద్రతలకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో సాయుధ గ్యాంగుల ఒత్తిడికి తలొంచిన ఆ ప్రధాని అరియల్‌ హెన్రీ(Prime Minister Ariel Henry) తన పదవికి తాను రాజీనామా(resignation) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సలహాదారు(Advisor) జోసఫ్‌ జూనియర్‌(Joseph Jr) ధ్రువీకరించారు.

We’re now on WhatsApp. Click to Join.

సరికొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రం ఆయనే పదవిలో కొనసాగుతారని వివరించారు. హైతీలోని సాయుధ ముఠాలతో పోరాడేందుకు ఐరాస భద్రతా కార్యక్రమం సాయం తీసుకొనేందుకు ప్రధాని అరియల్‌ హెన్రీ ఇటీవల కెన్యాకు వెళ్లారు. ఆ దేశం నుంచి 1,000 మంది పోలీసు అధికారులను రప్పించి హైతీలో సాయుధ గ్యాంగులను అణచి వేసేలా ఓ ఒప్పందంపై సంతకం చేశారు.

read also :Anupama Parameswaran : స్టార్ తనయుడితో అనుపమ.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు..!

సరిగ్గా అదే సమయంలో దేశ రాజధాని పోర్ట్‌ ఒ ప్రిన్స్‌లో ప్రధాన కారాగారంపై దాడి చేసి దాదాపు 4,000 మంది కరుడుగట్టిన ఖైదీలను సాయుధ గ్యాంగులు విడిపించాయి. వీరంతా కలిసి రాజధానిని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొని ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి అరాచకాలకు తలొగ్గి ప్రధాని పదవి నుంచి తప్పుకోక తప్పలేదు.