Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
మేష రాశి
ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో కొంత ఆటంకాలేర్పడుతాయి. ఆవేశానికి గురికాకూడదు. ఒత్తిళ్ళు పనికిరావు. కొత్త పనిని ప్రారంభించవద్దు. నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో విభేదాలున్నాయి జాగ్రత్త. ఏ విషయాన్నీ ఎక్కువగా ఆలోచించవద్దు. ఉద్యోగులు పని ఒత్తిడి ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం ఉండదు. ధనలాభం ఉంది. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మిథునం
ఈరోజు మిథునరాశి వారు మాటమీద సంయమనం పాటించాలి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారున్నారు జాగ్రత్తపడాలి. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఉన్నా మంచి ఫలితం వస్తుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు మంచిరోజు. శుభవార్త వింటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
Also read : Korean Beauty Tips: కొరియన్స్ అంత అందంగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?
కర్కాటకం
ఈరోజు కర్కాటక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. కోర్టు కేసులు ఎదుర్కొనేవారికి ఈ రోజు కొంత ఇబ్బందికరమైన రోజు. ప్రశాంతంగా ఉండటం మంచిది. ధనమును జాగ్రత్తగా ఖర్చుచేయాలని సూచన. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి రోజు..నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
సింహం
ఈరోజు సింహరాశి వారికి వ్యాపారంలో నష్టాలొచ్చే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలకు సంబంధించి మానసిక ఒత్తిడి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండండి. అవసరం లేని దగ్గర కూడా ఏదో ఒకటి మాట్లాడే ధోరణి విడిచిపెట్టాలి. ధైర్యంగా మీ సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
కన్య (Today Horoscope)
ఈరోజు కన్యారాశి వారు ఏదో విషయంలో విచారంగా ఉంటారు. అతి ఆలోచన తగదు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. మీరు చేసే పనుల్లో సమయస్ఫూర్తి కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సలహాను పాటించడం మంచిది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, నూతన ప్రణాళికలు అమలు చేయాలన్నా శుభసమయం. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తుల
ఈరోజు తులారాశి వారు అపార్థాలకు దూరంగా ఉండండి. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కానీ వాటివల్ల మీకు మంచే జరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తలుచుకుని బాధపడతారు. ప్రతికూల విషయాలు మనసులో ఉంటే తీసేయడమే మంచిది. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం, అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
ఈరోజు వృశ్చిక రాశివారు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. చిన్న డిస్కషన్ పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. జీవిత భాగస్వామి కారణంగా ఇబ్బంది పడతారు. మీ మనసు కలత చెందుతుంది. డబ్బు వృధా అవుతుంది. ఎవరు ఏమన్నా మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.
ధనుస్సు
ఈరోజు ధనుస్సు రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కానీ దూర ప్రయాణం చేయొద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
మకరం
ఈరోజు మకర రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉండాలని సూచన. వ్యాపారంలో ఆటంకాలు ఉన్నా మిత్రుల సహాయంతో కొనసాగించాలి. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభం
ఈరోజు కుంభ రాశిలోని వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. నష్టపోయే అవకాశం ఉంది. కష్టతరమైన రోజు. జీవిత భాగస్వామితో విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు పనిపై నిర్లక్ష్యం వద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. మహావిష్ణువును పూజించాలి.
మీనం
ఈరోజు మీన రాశి వారు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. ఏదైనా పెద్ద లావాదేవీ చేయాలనుకుంటే ఈరోజు ఆ ఆలోచన విరమించుకోవడమే మంచిది. గాయపడే ప్రమాదం ఉంది. ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
గమనిక : ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.