Today Horoscope : ఆగస్టు 31 గురువారం రాశి ఫలాలు.. వారు అనవసర విషయాల్లో తలదూర్చరాదు

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 08:27 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. రాజకీయ నాయకులకు కలసివచ్చేటటువంటి రోజు. ప్రణాళికల అమలులో సమస్యలు తొలగిపోతాయి.కొత్త భావోద్వేగ సంబంధాలు ప్రారంభమవుతాయి. గురు దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి అక్కరలేని ఖర్చుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అప్పులు చేయరాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికము. పనిని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేరు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. దత్తాత్రేయుని పూజించండి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు తొందరపడొద్దు. తొందరపాటు ప్రభావం మీ పనిపై పడుతుంది. కుటుంబములో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చికాకులతో కూడిన వాతావరణం. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికం. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు  ప్రయాణించేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యమైన పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు.  ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీ యొక్క ప్రణాళికబద్ధంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

సింహం

ఈరోజు సింహరాశి వారు అనవసర విషయాలపై కోపం తెచ్చుకునే స్వభావాన్ని మార్చుకోవడం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు కష్టంతో కూడియున్నటువంటి వాతావరణం. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమయ్యే పరిస్థితి. చర, స్థిరాస్తుల వివాదాలు సర్దుమణుగుతాయి. దత్తాత్రేయుని పూజించాలి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి ఘర్షణతో కూడిన వాతావరణం. చికాకులు అధికమగును. అప్పుల బాధ ఏర్పడును. ఖర్చులు అధికమగును. రైతాంగంవారికి, ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు.  అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు సమయం. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.

తుల

ఈరోజు తులారాశికి చెందిన ఉద్యోగులు ఉన్నతాధికారులతో అనవసర వాదనలు పెట్టుకోకపోవడమే మంచిది. కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. శత్రువులపై  మీరు పైచేయి సాధిస్తారు. గణపతి ధ్యానం రక్షిస్తుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోరాదు. జీవిత భాగస్వామితో వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఎవ్వరిపైనా అంచనాలు పెంచుకోవద్దు. మనస్సును నియంత్రించుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అదికం. సంతానం వలన చికాకులు ఏర్పడును. దత్తాత్రేయుని పూజించాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు నూతన ప్రణాళికలు అమలు చేయాలనే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు శుభ సమయం. స్థానచలన మార్పులు సత్ఫలితాలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. గురుబలం కోసం శనగలు దానమివ్వాలి.

మకరం

ఈరోజు మకర రాశిలోని  వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. మీ పనిలో ఆటంకాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయములు ఏర్పడును. మానసిక ఘర్షణలు, గొడవలు, చికాకులు అధికమగును. స్త్రీలకు మధ్యస్థం నుండి చెడు సమయం. గణపతిని దర్శించండి.

Also read:Turmeric Milk Benefits: పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగుతున్నారా.. ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు అత్యుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబములో ఏదో ఒక సమస్య వేధించును. రుణ సమస్యలు బాధించును. ఏ పని చేసినా చికాకులు కలుగును. . కుటుంబ వ్యవహారాల్లో ఘర్షణలతో కూడిన వాతావరణం ఏర్పడొచ్చు. వ్యాపారస్తులకు చెడు సమయం. దత్తాత్రేయుని పూజించాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి దాంపత్య సంతోషం తగ్గుతుంది. జీవిత భాగస్వామి గురించి ఆందోళన ఉంటుంది. భావోద్వేగానికి లోనై  ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఖర్చులు అధికమగును. ధనపరమైనటువంటి సమస్యలు అధికమగును. కోర్టు సమస్యలు ఇబ్బందిపెట్టును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయరాదు. నమ్మి ఇతరులకు ధనాన్ని ఇవ్వరాదు. జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. శనగలు దానమివ్వాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.