Today Horoscope : సెప్టెంబరు 2 శనివారం రాశి ఫలాలు.. వారు పనుల్ని వాయిదా వేసుకోవడం మంచిది

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..

Published By: HashtagU Telugu Desk
Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు ఇంటి సమస్యలను ఇతరుల ముందు చెప్పడం అంత మంచిదికాదు. మీ ఇష్టాలను ఇతరులపై రుద్దకూడదు.కుటుంబ సభ్యుల సహకారంతో ఆపదలు తొలగుతాయి. విచారకర సంఘటనలు ఎదురైనా, బుద్ధి బలంతో పరిష్కరిస్తారు. రాజయోగం ఉన్నది. శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి సుప్రభాతం చదవండి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయడం మంచిది. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. అపజయాలను అధిగమిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు డబ్బు అందుతుంది. ఇచ్చిన మాట నిలుపుకోండి. ఆంజనేయ స్వామిని దర్శించాలి. నవగ్రహ

మిథునం

ఈరోజు మిథునరాశి వారికి పనిలో నిబద్దత అధికం అవుతుంది. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ధనయోగం వస్తుంది. శనికి తైలాభిషేకం చేయాలి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పదాలు జాగ్రత్తగా వాడాలి. కుటుంబంలో పరస్పర సామరస్యం తగ్గవచ్చు. ఇబ్బంది కలిగించేవారున్నారు జాగ్రత్త. మీలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మీ ఓర్పు, సంయమనం విజయానికి దారులు వేస్తాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించడం మంచిది.

సింహం

ఈరోజు సింహరాశి వారు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో కొంచెం సున్నితంగా వ్యవహరించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు అనుకున్న పనులు నెరవేరాలంటే ఉత్సాహంతో పనిచేయాలి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. లక్ష్మీస్తుతి శుభప్రదం.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారిని ద్వేషించే వారున్నారు. సహనంతో వ్యవహరిస్తే ప్రమాదాలు దరిచేరవు. మేధావుల సహవాసం వల్ల ప్రయోజనం పొందుతారు. ధనలాభం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అవసరం. శుభవార్త వింటారు. గణపతి దర్శనం శుభదాయకరం.

Also read: Hip Hop India Winner: హిప్ హాప్ ఇండియా విన్నర్ రాహుల్ భగత్

తుల

ఈరోజు తులారాశి వారు అనుకున్న పనులన్నీ పెండింగ్ పడతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత పాటించాలి.  ఓపికగా వ్యవహరించాలి. నష్టాలను నివారించండి. శత్రువులపై విజయం సాధిస్తారు. మంచి భవిష్యత్తు ఉంది. లక్ష్మీగణపతి ధ్యానం శుభాన్నిస్తుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు అసాధ్యాలను సుసాధ్యంగా మారుస్తారు. కొన్ని సంఘటనలు ఇబ్బందిపెట్టినా ఎంపిక చేసుకున్న పనులు పూర్తవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగుల పట్ల అధికారుల ప్రతికూల వైఖరి ఉండొచ్చు. పిల్లలపై ఆగ్రహం ప్రదర్శించకూడదు.నిదానంగా ఆలోచిస్తే విజయం మీదే. భూలాభం సూచితం. సుబ్రహ్మణ్య ఆరాధన శక్తినిస్తుంది.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు వృధా వ్యయాన్ని నివారించండి. పెద్దల సూచనలు తప్పకుండా తీసుకోండి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అవరోధాలు తొలగుతాయి. సందేహించకుండా పనిచేయాలి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. దుర్గామాతను దర్శించండి.

మకరం

ఈరోజు మకర రాశి వారి పెండింగ్ పనులు పూర్తవుతాయి. కాస్త ఓర్పుగా వ్యవహరించాలి. ఉద్యోగులు, వ్యాపారులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. మీ క్షమాగుణం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. తల్లి తరపు వారి ద్వారా మేలు జరుగుతుంది. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.  ఒక విషయంలో తడబాటు ఉంది. తికమక పెట్టేవారున్నారు జాగ్రత్త. మిత్రుల సూచనలతో వారాంతంలో అన్నీ సర్దుకుంటాయి. అవరోధాలను అధిగమిస్తారు. మీ నిర్ణయాలే మీ విజయానికి పునాదులు. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. శివారాధన శుభప్రదం.

మీనం 

ఈరోజు మీన రాశి వారు శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. అదృష్ట సిద్ది ఉన్నది. ఖర్చుల్ని నియంత్రించుకోండి. దానగుణంతో విఘ్నాలు తొలగుతాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. కెరీర్లో మరో అడుగు ముందుకేసేందుకు ఇదే మంచిసమయం. ఆదిత్య హృదయం పఠించాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

  Last Updated: 02 Sep 2023, 07:49 AM IST