Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
మేష రాశి
ఈరోజు మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా వాటిని అధిగమిస్తారు. ముఖ్యంగా బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. తెలియని వారితో ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. మిత్రులకు గొడవలకు దూరంగా ఉండండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారు కొన్ని ముఖ్య పనులు అనుకున్న సమయంలోగా పూర్తి చేస్తారు. అప్పులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. అష్టమంలో ఉన్న చంద్రుడు అనుకూలంగా లేడు. కాబట్టి చంద్రుడిని శాంత పరిచేందుకు చంద్ర శ్లోకాన్ని చదువుతూ ఉండండి.నవగ్రహ ఆలయాలను దర్శించండి.
మిథునం
ఈరోజు మిథునరాశి వారిని ముఖ్య వ్యవహారాల్లో సమయస్ఫూర్తి కాపాడుతుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఒక శుభవార్త వింటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
Also read: Sleep: ఏంటి! చీకటి గదిలో పడుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?
కర్కాటకం
ఈరోజు కర్కాటక రాశి వారికి మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. వృధా ఖర్చులు చేయరాదు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు సర్దుబాటవుతాయి. రావలసిన ధనము సకాలంలో చేతికి అందుతుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి.
సింహం
ఈరోజు సింహరాశి వారికి మానసిక ఆందోళనలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ద చేయడం మంచిది కాదు. అన్ని పనుల నుండి ఆదాయం అందుతుంది. ఆస్తిని వృద్ధి చేసే పనుల్లో ముందుకు వెళతారు. నిరుద్యోగులకు మంచి ఫలితం ఉంటుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్య (Today Horoscope)
ఈరోజు కన్యారాశి వారికి కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. చాలాకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడతారు. ఎవరినీ అతిగా నమ్మడం మంచి పద్ధతి కాదు. ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. చిన్నపాటి వివాదాలు కలుగును. బంధువర్గంలో అకారణ వివాదాలు కలుగుతాయి. మీపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలించవు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తుల
ఈరోజు తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పుల బాధ నుండి బయటపడతారు. అవసరానికి సహాయం కూడా అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. శివాలయాన్ని దర్శించండి.
వృశ్చికం
ఈరోజు వృశ్చిక రాశివారు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఎవరినీ అతిగా నమ్మడం మంచిది కాదు. కొన్ని వివాదాలు కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. సంతాన, వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
ధనుస్సు
ఈరోజు ధనుస్సు రాశి వారికి ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణాలు కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. అన్ని రంగాలవారికి అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు వెళతారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకరం
ఈరోజు మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వారితో కలహాలు పెట్టుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు. మానసిక సమస్యలు బాధిస్తాయి. బంధువులు, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
Also read: International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఇదే ఆరోజు..!
కుంభం
ఈరోజు కుంభ రాశి వారు చేపట్టే పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో మాటపట్టింపులు వస్తాయి. కొన్ని బాధపెట్టే సంఘటనలు కూడా జరుగుతాయి. మీ నిర్ణయాలు మారిపోతూ ఉండకూడదు. స్థిర నిర్ణయాలు ఆర్థికంగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలోనూ ఉన్నతాధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శివాలయాన్ని దర్శించండి.
మీనం
ఈరోజు మీన రాశి వారు కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు వెళ్ళడం మంచిది. రావలసిన ధనము సకాలంలో అందుకుంటారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. కళారంగం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.