Today Horoscope : ఆగస్టు 21 సోమవారం రాశి ఫలితాలు.. వారి ప్రయత్నాలు ఫలిస్తాయి

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 07:44 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కెరీర్ కి ఉపయోగపడే ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. మీరు ప్రారంభంచబోయే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశివారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆహ్లాదకరమైన వాతావారణం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. స్త్రీలు ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. సోదర వర్గంతో ఆనందముగా గడుపుదురు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఈరోజు మిథున రాశివారు దూరప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించకపోవడమే మంచిది. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. కుటుంబంతో మంచి బంధం కొనసాగేలా చూడండి.

 Also read: Arikela Upma : అరికెల ఉప్మా తయారీ విధానం.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది..

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రశాంతంగా ఉండటం మంచిది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం. ధనమును జాగ్రత్తగా ఖర్చుచేయాలని సూచన. మీయొక్కతెలివితేటలను సద్వినియోగం చేసుకుంటారు. కర్మాటక రాశి వారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

ఈరోజు సింహరాశి వారు సంతోషంగా ఉంటారు. మతపరమైన ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇంట్లో ఉన్న అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆర్థికి స్థితి బావుంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలొస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కోర్టు వ్యవాహారాలు అనుకూలంగా ఉంటాయి

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారి మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. శ్రమ పడాల్సినటువంటి సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు మధ్యస్థం. శ్రమకు తగిన ఫలితం లభించును. విద్యార్థులకు మధ్యస్థం. రైతాంగం, సినీరంగం రంగాలవారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు మధ్యస్థం నుండి అనుకూలం. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తుల

ఈరోజు తులారాశి వారు  ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి.  కొన్ని ప్రత్యేక పనుల  పూర్తిచేయాల్సిన అవసరం వస్తుంది. కొత్తగా ఏ పనులు ప్రారంభించవద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఒత్తిళ్ళు అధికం. కుటుంబముతో ఇబ్బందికరమైన వాతావరణం. మనస్సును నియంత్రించుకోవాలి. అనసవర విషయాలు ప్రస్తావించరాదు. కుటుంబ, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పని ఒత్తిళ్ళు అధికం. సంతానం వలన చికాకులు. విద్యార్థులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి అనుకూలం. స్త్రీలకు చెడు సమయం. ఉద్యోగస్తులకు మధ్యస్థం సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి  మంచి రోజు అవుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త పని ప్రణాళికలు అమలు చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మకరం

ఈరోజు మకర రాశి వారికి  మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే పనులు కలసివచ్చును. శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో ప్రశంసలు. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి లాభము. సినీరంగం, రైతాంగం వారికి మధ్యస్థం. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

కుంభం

ఈరోజు కుంభ రాశివారు దూర ప్రయాణం చేయాల్సి వస్తే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఎవ్వరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వొద్దు. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి  మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావంచేత ఖర్చులు అధికము. కోర్టు సమస్యలు. ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగును. గొడవలకు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. అప్పులు చేయరాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు, రైతాంగం మరియు సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికము. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలు, శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.