Today Horoscope : సెప్టెంబరు 1 శుక్రవారం రాశి ఫలాలు.. వారికి మొహమాటంతో శ్రమ పెరుగుతుంది

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

Published By: HashtagU Telugu Desk
Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి ప్రతికూలం. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధా అవుతాయి. ఉద్యోగం మారాలనే ఆలోచన ఆపండి. ప్రత్యర్థులతో అప్రమత్తం. అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. వ్యాపారులు ప్రయోగాలకు దూరంగా ఉండాలి. దుర్గాదేవిని స్మరిస్తే మేలు జరుగుతుంది.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది. మనస్సుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తెలివిగా ప్రవర్తిస్తే మంచింది. మీరు చేపట్టిన పనులన్నీ ఆలస్యమైనా పూర్తవుతాయి. లక్ష్మీదేవిని పూజించండి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు మానసికంగా బలహీనంగా ఉంటారు. ప్రణాళికలను రహస్యంగా  ఉంచండి. కలహసూచన ఉన్నది. తొందరపడి మాట్లాడితే ఇతరుల అపార్ధం చేసుకొనే ప్రమాదం ఉన్నది. రుణ సమస్యలు ఎదురవుతాయి.  మిత్రుల సాయంతో ఆర్థిక నష్టాన్ని నివారిస్తారు. విష్ణుమూర్తిని స్మరించాలి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ఆచితూచి అడుగు వేయాలి. వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. ధైర్యంతో ముందుకు సాగండి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించండి.  విష్ణు సహస్రనామం పఠించండి.

సింహం

ఈరోజు సింహరాశి వారు తప్పులను సరిదిద్దుకునేందుకు మంచి సమయం. కొన్ని కారణాల వల్ల మీరు పిల్లలపై కోపగించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా  ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. శివారాధన శుభప్రదం.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు వివాదాలకు తావివ్వకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి మన్ననలూ అందుకోండి.  ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు అనుకూలమైన రోజు. ఆలోచనా విధానంలో పరిపక్వత వస్తుంది. మిత్ర బలం పెరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించండి.

తుల

ఈరోజు తులారాశి వారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. శత్రువులు  యాక్టివ్ గా ఉన్నారు బీ అలర్ట్. మీ రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు.  కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. భగవదనుగ్రహంతో ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వారాంతరంలో శుభయోగం ఉంది. గణపతి ధ్యానం రక్షిస్తుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు ఎప్పుడో  పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. మీ పక్షాన ఉంటూ ఇబ్బంది పెట్టే వారుంటారు జాగ్రత్త. ప్రలోభాలకు లొంగరాదు. ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి.  విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. శనిస్తోత్రం చదువుకోవాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి కారణంగా మీరు ఆందోళన చెందుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జీవిత భాగస్వామి పట్ల ప్రవర్తన అనుచితంగా ఉండేలా చూసుకోండి.  చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి.  అనవసర ఆలోచనలతో సమయం వృధా చేసుకోవద్దు. వృధా ప్రయాణాలుంటాయి. వ్యయాలు పెరగకుండా జాగ్రత్తపడాలి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి.

మకరం

ఈరోజు మకర రాశి వారు వ్యయభారం విషయంలో జాగ్రత్తపడాలి. వ్యతిరేకంగా మాట్లాడే వారున్నారు జాగ్రత్త. ఎవరినీ విమర్శించవద్దు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భవిష్యత్తుకి ఉపయోగపడతాయి. గణపతినీ, సుబ్రహ్మణ్యస్వామినీ దర్శించండి.

Also read: Beauty Care: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం?

కుంభం

ఈరోజు కుంభరాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రమ అవసరం. మీ పనులు ఆటంకాలతో, చికాకులతో పూర్తవుతాయి. కొంతమంది మీకు హాని చేయాలనుకుంటున్నారు. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి.సూర్యధ్యానం ఆరోగ్యాన్నిస్తుంది.

మీనం 

ఈరోజు మీన రాశి వారు ప్రమోషన్, బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది.  అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని పొరపాట్లు జరిగే ఆస్కారం లేకపోలేదు. ధైర్యం, ఏకాగ్రత రెండూ ముఖ్యం. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
  Last Updated: 01 Sep 2023, 07:37 AM IST