Super Mosquitoes : సూపర్ దోమలు రెడీ అవుతున్నాయి..
కరోనా వ్యాక్సిన్ల తయారీ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టిన మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. ఇప్పుడు సూపర్ దోమల అభివృద్ధి ప్రాజెక్టులోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు..
యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్ (Oxitec)కి బిల్ గేట్స్ నిధులు అందిస్తున్నారు.
మలేరియాను ప్రపంచం నుంచి తరిమికొట్టే సామర్ధ్యం కలిగిన సూపర్ దోమలను “Oxitec” కంపెనీ తయారు చేయనుంది.
ఇంతకీ సూపర్ దోమలంటే ఏమిటి ? అనే ప్రశ్న మైండ్ లో వస్తోందా ?
Also read : Bomb Threat: విమానాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరింపు.. పోలీసులు అదుపులో నిందితుడు
మలేరియాను అంతం చేసే ఈ మిషన్ లో భాగంగా ఆక్సిటెక్ కంపెనీ బ్రిటన్ కు చెందిన మగ దోమలకు ల్యాబ్ లో జన్యు మార్పులు చేస్తుంది. ఆడ దోమలు ఎక్కువ కాలం జీవించకుండా నిరోధించే ఒక ప్రత్యేకమైన జన్యువును వాటిలోకి ప్రవేశపెడుతుంది. ఇలా జన్యు మార్పులు చేసే మగ దోమలే సూపర్ దోమలుగా ఆవిర్భవిస్తాయి. సూపర్ మగ దోమలు.. ఆడ దోమలతో జతకట్టినప్పుడు, అవి ఆడ దోమలలోకి తమ జన్యువులను బదిలీ చేస్తాయి. ఈ డేంజరస్ జన్యువులు ఆడ దోమలను చంపేస్తాయి. సూపర్ దోమల కారణంగా ప్రపంచంలో మగ దోమల సంఖ్య పెరుగుతుందని, ఆడ దోమల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆడ దోమలే మనుషులను కుడతాయని, వాటి వల్లే మలేరియా వస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆడ దోమల అంతం ద్వారా మలేరియా మహమ్మారిపై గెలవాలనే మానవుడి పంతం నెగ్గుతుందని బిల్ గేట్స్ నమ్ముతున్నారు. అందుకే ఈ రీసెర్చ్ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్నారు.
Also read : Today Horoscope : ఆగస్టు 16 బుధవారం రాశి ఫలితాలు.. వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి
సూపర్ దోమలను విడుదల చేసే దేశాలు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. “సూపర్ మగ దోమలు పర్యావరణానికి, మానవులకు రెండింటికీ ముప్పు కాదని ఆక్సిటెక్ పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100 కోట్ల సూపర్ దోమలు(Super Mosquitoes) విడుదలయ్యాయి. వీటి వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు” అని చెప్పారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటిలో వచ్చే ఏడాది సూపర్ మగ దోమలు విడుదలవుతాయి. ఇథియోపియా, సుడాన్, సోమాలియా, కెన్యా, నైజీరియా, ఘనా వంటి ఆఫ్రికా దేశాలలో 1.20 కోట్ల సూపర్ మగ దోమలు విడుదలవుతాయి. బ్రెజిల్‌లోనూ సూపర్ దోమలను రిలీజ్ చేయనున్నారు.