Foxconn Founder – Presidential Bid : యాపిల్ ఫోన్ల ఉత్పత్తి అనగానే గుర్తుకొచ్చే పేరు ఫాక్స్ కాన్ కంపెనీ. ఈ కంపెనీ మొత్తం విలువ రూ.6.50 లక్షల కోట్లు.. ఇండియాలో కూడా ఫాక్స్ కాన్ కు ఎన్నో ఐఫోన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ లోనూ త్వరలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇంత రిచెస్ట్ కంపెనీ ‘ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్’ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ కీలక ప్రకటన చేశారు. 2024లో తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలో ఉంటా నని సోమవారం తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-తే అధికార పక్షం ‘సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ తరఫున మరోసారి రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుత దేశ ఉపాధ్యక్షుడు విలియం లై కూడా పోటీలో నిలువనున్నారు. వాస్తవానికి ప్రస్తుతం తైవాన్ లో అత్యంత బలమైన నేతగా ఉపాధ్యక్షుడు విలియం లై ఉన్నారు. ఆయనను తట్టుకొని నిలబడటం అపర కుబేరుడు, ఫాక్స్‌కాన్ అధినేత టెర్రీ గౌకు కూడా సాధ్యపడకపోవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Also read : G20 – Delhi : జీ20 సదస్సుకు ఢిల్లీ ఇలా ముస్తాబైంది.. ఫోటో స్టోరీ
ఫాక్స్ కాన్ అధిపతి టెర్రీ గౌ గురించి వివరాలివీ..
1. టెర్రీ గౌ తైవానీస్ బిలియనీర్ వ్యాపారవేత్త (Foxconn Founder – Presidential Bid). Apple కంపెనీ తరఫున ఐఫోన్లను ఈయన కంపెనీ Foxconn ఉత్పత్తి చేస్తుంటుంది.
2. 2016లోనే టెర్రీ గౌ తన కంపెనీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందువల్లే ఎన్నికలకు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
3. టెర్రీ గౌ తొలుత చైనా అనుకూల రాజకీయ పార్టీ కుమింటాంగ్ (KMT)లో చేరారు.ఇదే తైవాన్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. గతంలో ఆ పార్టీ తరఫున పలు పార్లమెంటు స్థానాల్లో పోటీచేసినా టెర్రీ గౌ గెలవలేకపోయారు.
4. 2019లో కూడా KMT పార్టీ తరఫున తైవాన్ అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం టెర్రీ గౌ ప్రయత్నించారు. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు.
5. తైవానీయుల సముద్ర దేవత ‘మజు’ కలలో కనిపించి.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయమని చెప్పినందు వల్లే తాను బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యానని టెర్రీ గౌ వెల్లడించడం విశేషం.
6. తైవాన్ చైనాలో భాగమని టెర్రీ గౌ నమ్ముతున్నారు. వన్-చైనా ఫ్రేమ్‌వర్క్ కింద తైవాన్, చైనాలు చర్చలు జరపాలని గతంలో ఆయన పిలుపునిచ్చారు.