Sherika De Armas : ఆమె మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్.. 26 ఏళ్ల చిన్న వయసులోనే గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయింది. ఈ దీనగాథ ఉరుగ్వేకు చెందిన షెరికా డి అర్మాస్ కు సంబంధించినది. 2015లో మిస్ ఉరుగ్వే కిరీటాన్ని అర్మాస్ దక్కించుకుంది. చైనా వేదికగా 2015లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లోనూ ఆమె తన దేశం తరఫున పాల్గొన్నారు. గత రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. అక్టోబర్ 13నే చనిపోయారు. ఈవిషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలు చేయించినా ఫలితం కనిపించలేదని, చివరకు అర్మాస్ తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
అర్మాస్ 2015లో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ‘‘బ్యూటీ మోడల్ అయినా.. అడ్వర్టైజింగ్ మోడల్ అయినా.. క్యాట్ వాక్ మోడల్ అయినా.. నేను ఎప్పుడూ మోడల్ గా ఉండటానికే ఇష్టపడతాను. ఫ్యాషన్ కు సంబంధించిన ప్రతీదీ నాకు ఇష్టం. ఏ అమ్మాయి అయినా మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశాన్ని సంతోషంగానే భావిస్తుంది’’ అని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది.