10 Strongest Currencies : టాప్-10 పవర్‌ఫుల్ కరెన్సీల లిస్టు ఇదే.. ఇండియా ర్యాంక్ తెలుసా ?

10 Strongest Currencies : ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 03:32 PM IST

10 Strongest Currencies : ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం మొదటి స్థానంలో కువైట్ దినార్ ఉంది. ఒక కువైట్ దినార్ విలువ 270.23 రూపాయలు. రెండో స్థానంలో బహ్రెయిన్ దినార్ ఉంది. దీని విలువ  220.4 రూపాయలుగా ఉంది. తర్వాతి స్థానాల్లో ఒమనీ రియాల్ (రూ. 215.84), జోర్డానియన్ దినార్ (రూ. 117.10), జిబ్రాల్టర్ పౌండ్ (రూ. 105.52), బ్రిటీష్ పౌండ్ (రూ. 105.54), కేమ్యాన్ ఐలాండ్ డాలర్ (రూ.99), స్విస్ ఫ్రాంక్ (రూ. 97.54), యూరో (రూ. 90.80) ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ జాబితాలో 10వ స్థానంలో అమెరికా డాలర్ ఉంది. దీని విలువ రూ.83.10. ఇక ఈ జాబితాలో ఇండియా 15వ ప్లేసులో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, వర్తక అవసరాల కోసం వినియోగిస్తున్న కరెన్సీగా అమెరికా డాలర్ ప్రాచుర్యాన్ని పొందిందని ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ తెలిపింది. కువైట్ దినార్ విజయానికి కారణం.. ఆ దేశం ఆర్థిక స్థిరత్వం, దాని చమురు నిల్వలు, పన్ను రహిత వ్యవస్థ అని పేర్కొంది. జనవరి 10 వరకు ఉన్న కరెన్సీ విలువల ఆధారంగా ఈ జాబితాను తయారుచేశామని ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్(10 Strongest Currencies) వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతోన్న వేళ.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కరెన్సీ నోట్లపై శ్రీరాముడి చిత్రంతో కూడిన రూ.500 నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణంతో కూడిన రూ.500 నోటు ఫొటో వైరల్ అవుతోంది. జనవరి 22న ఈ కొత్త నోటును జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఇదంతా ఫేక్ ప్రచారం అని తెలుస్తోంది. రివర్స్ ఇమేజింగ్ ద్వారా ప్రయత్నించి చూడగా.. ఒరిజినల్ రూ.500 నోటును ఇలా మార్ఫింగ్ చేశారని అర్థమవుతోంది. ఇది కేవలం ఎడిటింగ్ చేసిన ఫొటో మాత్రమేనని దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇప్పటి వరకూ కొత్త కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్థూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్‌ను ఆర్బీఐ ప్రారంభించింది. అప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంటోంది. గాంధీజీ చిత్రం స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారని ఏడాదిన్నర క్రితం ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని రిజర్వ్ బ్యాంక్ వివరణ ఇచ్చింది.

Also Read: Google Ads -2023 : గూగుల్ యాడ్స్ వ్యయంలో నంబర్ 1 బీజేపీ.. నంబర్ 2 ఏదో తెలుసా ?