Fire Breaks : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. లోఖండ్వాలా కాంప్లెక్స్లోని ఓ నివాస భవనంలో మంటలు చెలరేగి.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంధేరీ ప్రాంతంలోని లోఖండ్వాలా కాంప్లెక్స్ వద్ద 4వ క్రాస్ రోడ్డులో ఉన్న 14 అంతస్తుల రియా ప్యాలెస్లో బుధవారం మంటలు చెలరేగాయి. భవనంలోని 10వ అంతస్తులో మంటలు వ్యాపించాయి.
స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతులు చంద్రప్రకాశ్ సోని (74), కంఠ సోని (74), పెలుబేట (42) గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.