ఈ తరం టీనేజ్ (Teenage) పిల్లలు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయనో, తల్లి తిట్టిందనో కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తన బిడ్డను ఫోన్ ఎక్కువగా వాడకూడదని తండ్రి మందలించడంతో ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పూణె జిల్లాలోని ఘోడేగావ్‌లో జరిగింది. 19 ఏళ్ల యువతి తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపినందుకు బాలిక తండ్రి మందలించాడని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం బాలిక (Girl) మృతదేహం నేలపై కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘోడేగావ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువతి 12వ తరగతి విద్యార్థి, ఒక్కతే సంతానం. ఆమె తండ్రి వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కారణాలతో టీనేజ్ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ వచ్చేశాడు.. ఇంటెన్స్ లుక్ లో పవన్ కళ్యాణ్!