Site icon HashtagU Telugu

KGH Hospital : విశాఖ కేజీహెచ్‌లో హృదయ విదారక సంఘటన..

Father Carries Oxygen Cylin

Father Carries Oxygen Cylin

ప్రభుత్వ హాస్పటల్స్ లలో డాక్టర్ల నిర్లక్ష్యం ఎంతమేర ఉంటుందో మరోసారి బయటపడింది. డబ్బులు పోయిన మంచిదే కానీ ప్రవైట్ హాస్పటల్స్ కే వెళ్లాలని చాలామంది భావిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పటల్ లలో ఎప్పుడు డాక్టర్స్ ఉంటారో..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..ప్రభుత్వాలు పలు ఆదేశాలు జారీచేసినప్పటికీ..ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది మాత్రం రోగుల పట్ల చాల నిర్లక్ష్యం వహిస్తుంటారు. అందుకే చూసి ..చూసి ప్రభుత్వ హాస్పటల్ కు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకునే బదులు అప్పు చేసైనా..ప్రవైట్ హాస్పటల్ కు వెళ్లి ప్రాణాలు దక్కించుకోవడం బెటర్ అని భావిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వైజాగ్ లోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ ఆసుపత్రి (King George Hospital (KGH))లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది విధి నిర్వహణలో ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్నారనే విషయాన్ని ఈ ఘటన చెప్పకనే చెప్పింది. నెలలు నిండకుండా పుట్టడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఓ పసిపాపను మెటర్నిటీ వార్డు నుంచి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి ఓ తండ్రి పడ్డ ఆవేదన అక్కడి వారినే కాదు చూస్తున్న నెటిజన్లకు సైతం కలిచివేసింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి సిబ్బంది ఎవరూ లేకపోవడం తో స్వయంగా ఆ తండ్రే ఆక్సిజన్ సిలిండర్‌ (Oxygen Cylinder)ను భుజాన వేసుకుని నర్స్ వెంట పరుగులుపెట్టాడు. పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని నర్స్ ముందు వెళ్తుంటే..ఆమె వెనుకాల ఆ తండ్రి వెళ్ళాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ప్రభుత్వాలు మారిన డాక్టర్ల తీరు మాత్రం మారడం లేదని వాపోతున్నారు.

Read Also : Barefoot: ఇంట్లో చెప్పులు లేకుండా నడుస్తున్నారా..? అయితే ఈ కథనం మీకోసమే..