Site icon HashtagU Telugu

Income Tax : కొత్త ఆదాయం ప‌న్ను విధానంపై ఫేక్ ప్రచారం..కేంద్ర ఆర్థికశాఖ స్పష్టత

Fake campaign on the new income tax policy.. Union finance department clarified

Fake campaign on the new income tax policy.. Union finance department clarified

New Income Tax Regime: సోమవారం (2024, ఏప్రిల్ ఒకటో తేదీ) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(New fiscal year) (2024-25) ప్రారంభమైంది. తదనుగుణంగా ఆర్థికపరమైన అంశాలపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఆదాయం పన్ను విధానంపై ప్రజలను, పన్ను చెల్లింపుదారులను తప్పుదోవ పట్టించే సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ద్రుష్టికి వచ్చింది. దీంతో కొత్త ఆదాయం పన్ను విధానంపై సందేహాలను నివ్రుత్తి చేయడంతోపాటు పన్ను పాలసీ ముఖ్యాంశాలను ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

.సోమవారం (2024, ఏప్రిల్ 1) నుంచి ఆదాయం పన్ను విధానంలో కొత్త మార్పులేమీ లేవు.
.ప్రస్తుతం అమలులో ఉన్న పాత పన్ను విధానం స్థానే ఆదాయం పన్ను చట్టంలో ‘సెక్షన్ 115బీఏసీ (1ఏ)’ చేరుస్తూ 2023 ఆర్థిక చట్టం తీసుకొచ్చారు.
.2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు మినహా వ్యక్తులకు కొత్త ఆదాయం పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది.
.కొత్త ఆదాయం పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, పాత ఆదాయం పన్ను పాలసీలో మినహాయింపుల, డిడక్షన్లు (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు, ఫ్యామిలీ పెన్షన్ రూ.15 వేలు) కొత్త ఆదాయం పన్ను పాలసీలో లేవు.
.ఇక నుంచి కొత్త ఆదాయం పన్ను విధానం డీఫాల్ట్‌గా ఉంటది. పన్ను చెల్లింపుదారులు ఆదాయం పన్ను చెల్లింపుల్లో తమకు (పాత, కొత్త ఆదాయం పన్ను విధానంలో) లాభదాయక విధానాన్ని ఎంచుకోవచ్చు.

కొత్త. పాత ఆదాయం పన్ను తేడాలు ఇలా..

2024-25 ఆర్థిక సంవత్సరం రిటర్న్‌లు ఫైల్ చేసే వారు కొత్త ఆదాయం పన్ను పాలసీ నుంచి తప్పుకునేందుకు వీలు ఉంటుంది. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉంటది. వ్యక్తిగత ఆదాయం ప్రత్యేకించి వేతన జీవులు ఒక ఏడాది కొత్త ఆదాయంపన్ను విధానం, మరొక ఏడాది పాత ఆదాయం పన్ను విధానం ఎంచుకోవచ్చు.

Read Also: TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్‌ ప్లాన్‌..!

కొత్త ఆదాయం పన్ను విధానం (115 బీఏసీ (ఐఏ) కింద రూ.3 లక్షల ఆదాయం వరకూ పన్ను చెల్లించనవసరం లేదు. రూ.3-6 లక్షల వరకూ ఐదుశాతం, రూ.6-9 లక్షల మధ్య ఆదాయం గల వారు 10 శాతం, రూ.9-12 లక్షల మధ్య ఆదాయం గల వారు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం గల వారు 20 శాతం, రూ.15 లక్షల పై చిలుకు ఆదాయం గల వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటది.

Read Also: Srisailam: శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

పాత ఆదాయం పన్ను విధానం కింద రూ.2.5 లక్షల వరకూ పన్ను చెల్లించనవసరం లేదు. రూ.2.5 – 5 లక్షల మధ్య ఆదాయం గల వారు ఐదు శాతం, రూ.5-10 లక్షల మధ్య ఆదాయం కల వారు 20 శాతం వరకూ, రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం కల వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version