Eye View : ఒక్క లుక్ లో సిటీ మొత్తం చూడొచ్చు.. మహానగరంలో జెయింట్ వీల్

ఎన్ని విమానాలు వచ్చినా.. ఎన్ని పారచూట్లు వచ్చినా.. మానవుడి ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. ఆకాశంలో పక్షిలా ఎగరగలిగితే  బాగుండు అని మనిషి అనుకుంటూ ఉంటాడు !! మనకు రెక్కలు రావడం ..మనం గగన వీధిలో రివ్వున ఎగరడం జరిగే పని కాదు !!కానీ రెక్కల పక్షిలా.. ఆకాశ వీధి నుంచి ఒక సిటీ వ్యూని(Eye View) చూసే అవకాశం ఒకటి ఉంది. 

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 08:06 AM IST

ఎన్ని విమానాలు వచ్చినా.. ఎన్ని పారచూట్లు వచ్చినా.. మానవుడి ఆ ఒక్క కోరిక నెరవేరలేదు.      

ఆకాశంలో పక్షిలా ఎగరగలిగితే  బాగుండు అని మనిషి అనుకుంటూ ఉంటాడు !!

మనకు రెక్కలు రావడం ..మనం గగన వీధిలో రివ్వున ఎగరడం జరిగే పని కాదు !!

కానీ రెక్కల పక్షిలా.. ఆకాశ వీధి నుంచి ఒక సిటీ వ్యూని(Eye View) చూసే అవకాశం ఒకటి ఉంది. 

ప్రపంచంలోని చాలా మహా నగరాల్లో “ఐ వ్యూ”(Eye View) ఫెసిలిటీ ఉంది. ఎత్త‌యిన అబ్జ‌ర్వేష‌న్ వీల్ లో మనం హాయిగా తిరుగుతూ మొత్తం సిటీని ఒక్క చూపులో చూడొచ్చు. ఇప్పటికే మన దేశ రాజధాని  ఢిల్లీలో 250 అడుగుల (76 మీటర్ల) ఎత్తు ఉండే భారీ అబ్జ‌ర్వేష‌న్ వీల్ ఉంది. అందులో కూర్చుంటే ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కనిపిస్తాయి. కుతుబ్ మినార్, ఎర్రకోట, అక్షరధామ్ ఆలయం, లోటస్ టెంపుల్, కన్నాట్ ప్లేస్, హుమాయున్ సమాధి వంటి స్మారక చిహ్నాలను కూడా చూడొచ్చు. త్వరలో ఇలాంటి భారీ అబ్జ‌ర్వేష‌న్ వీల్  మరో మహానగరంలో అందుబాటులోకి రాబోతోంది. ఎక్కడో తెలుసా? మన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో!!

బాంద్రా-వర్లీ సీ లింక్ దగ్గర..

ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ దగ్గర జెయింట్ వీల్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ లోని జెయింట్ వీల్  తరహాలో దీన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 6 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారని అంటున్నారు. ఇందులో కూర్చుంటే అరేబియా సముద్రం, మొత్తం ముంబై సిటీ కనిపిస్తుందని చెబుతున్నారు. వచ్చే నెల (జూన్) చివరి వారంలోగా దీనికి సంబంధించిన నిర్మాణ, డిజైన్  ప్రణాళిక రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో టెండర్లు ఆహ్వానించి .. ఎంపికయ్యే సంస్థను నిర్మాణ పనులు అప్పగిస్తారు. వచ్చే మూడు సంవత్సరాలలోగా ముంబై సిటీ ఐ వ్యూ అందించే జెయింట్ వీల్ రెడీ అవుతుంది.

Also read : Muchintal: ప్రపంచ టూరిజం ప్రాంతంగా రామానుజుల ప్రాంగణం!

ప్రపంచంలోనే అతిపెద్ద అబ్జ‌ర్వేష‌న్ వీల్ 

ఇప్పటికే అబ్జ‌ర్వేష‌న్ వీల్ ఉన్న నగరాల లిస్టులో దుబాయ్ (యుఏఈ), లాస్ వెగాస్ (యుఎస్), సింగపూర్, లండన్ (యుకె), నాన్‌చాంగ్ (చైనా), వీఫాంగ్ (చైనా), ఒసాకా (జపాన్), షెన్‌జెన్ (చైనా), మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా), ఫ్లోరిడా (యుఎస్) , పారిస్ (ఫ్రాన్స్), నమ్ పెన్ (కంబోడియా), సావో పాలో (బ్రెజిల్), జకార్తా (ఇండోనేషియా), మాస్కో (రష్యా), బెర్లిన్ (జర్మనీ) ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అబ్జ‌ర్వేష‌న్ వీల్ దుబాయ్ లో ఉంది. దాని హైట్ 250 మీటర్లు.

అబ్జ‌ర్వేష‌న్ వీల్‌లో ఏమేం ఉంటాయి ?

అబ్జ‌ర్వేష‌న్ వీల్‌ లలో సాధారణంగా  స్కై డైనింగ్‌, ప్ర‌త్యేకంగా కార్పొరేట్ సెల‌బ్రేష‌న్ ప్యాకేజీలు, ఈవెంట్‌లు నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అంటే బ‌ర్త్‌డేలు, చిన్నపాటి సెలబ్రేషన్స్ లాంటివి కూడా వాటిలో చేసుకోవ‌చ్చు. ఈ వీల్ ఒక్క‌సారి చుట్టూ తిర‌గ‌డానికి సగటున  15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఢిల్లీలో ఉన్న జెయింట్ వీల్ టికెట్ ధర పెద్దలకు రూ.250. సీనియర్ సిటిజెన్లకు రూ.150. మూడేళ్ళ లోపు పిల్లలకు ఎంట్రీ ఫీజు రూ.100.