Site icon HashtagU Telugu

Delhi Liquor Scam : సిసోడియాపై సాక్ష్యాలున్నాయ్.. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో సీబీఐ

Delhi Liquor Scam

Delhi Liquor Scam

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam) మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. సంవత్సరానికి రూ.500 కోట్లు చొప్పున అక్రమంగా సంపాదించే ప్లాన్ తో ఈ కుంభకోణం జరిగిందని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఏప్రిల్ 25న దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీటులో సీబీఐ తెలిపింది. మనీశ్ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ ధాల్‌లపై ఈ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. ఈ ఛార్జిషీటును విచారణకు స్వీకరించడంపై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వు చేసింది. మే 27న తీర్పు చెప్పనున్నట్లు తెలిపింది.

also read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాములో సంచలనం: అప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్

లిక్కర్ పాలసీలో లూప్ హోల్స్..

మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా, కేవలం ప్రైవేటు దుకాణాల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేలా ఢిల్లీ లిక్కర్ పాలసీని(Delhi Liquor Scam) రూపొందించారు. మద్యాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజేయడానికి కూడా అనుమతించారు. మద్యం దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరచి ఉంచడానికి అనుమతించింది. మద్యం అమ్మకాలకు లైసెన్స్ పొందినవారు అపరిమితమైన డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని తెలిపింది. ఈ కుంభకోణంలో మనీలాండరింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు జరుపుతోంది. అరెస్టయిన ఒక లిక్కర్ వ్యాపారి ద్వారా రూ.100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి ‘సౌత్ గ్రూప్’ అనే లిక్కర్ లాబీ ఇచ్చినట్లు తెలిపింది. ఈ సొమ్మును గోవా ఎన్నికల కోసం ఆప్ పార్టీకి ఇచ్చినట్లు పేర్కొంది. ఈ కుంభకోణం వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ ప్రశ్నించింది.