SLBC Tunnel : మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ బృందం నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. టన్నెల్‌లో ఇప్పటికీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
Read Also: Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన
సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం ముఖ్యమా? కార్మికుల ప్రాణాలు ముఖ్యమా? కనీసం సీఎం అక్కడికి వెళ్లి సహాయక చర్యలపై సూచనలు చేయలేదు అని హరీశ్‌రావు ఆక్షేపించారు. టన్నెల్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇప్పటికి ఐదు రోజులైంది. సొరంగంలో ఉన్నవారు ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది. ఎంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభిస్తే అంత తొందరగా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయొచ్చు. ఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరమని ఆయన అన్నారు.
సొరంగం మొత్తం మూసుకుపోవడంతోపాటు 15 మీటర్ల ఎత్తు బురద పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్ ముందుభాగం ధ్వంసమై వెనుకభాగం తన్నుకువచ్చింది. పైకప్పు కూలిన ప్రాంతం 200 మీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. ఎట్టకేలకు 14వ కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నాయి. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టీబీఎన్ మిషన్ కన్వేయర్ బెల్టు, ఆక్సిజన్ ట్యూబ్, శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.
Read Also: Posani Krishna Murali Arrest : రహస్య ప్రదేశంలో విచారణ