Site icon HashtagU Telugu

Lagacharla : రైతుల నుండి భూములు వేరు చేయడం అంటే.. తల్లిని బిడ్డను వేరు చేయడమే: ఈటల

Etela Rajender comments on revanth reddy

Etela Rajender comments on revanth reddy

Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్ద నుంచి బెదిరించి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి భూముల నుంచి వేరు చేయడం అంటే తల్లిని బిడ్డను వేరు చేయడం లాంటిదన్నారు. రైతులు ఒప్పుకోకపోయినా అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి 1500 పోలీసు బలగాలను మోహరించి గ్రామాల మీదపడి గ్రామాల ప్రజలను అరెస్టులు చేశారని ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగిన పాపానికి కొట్టారని మండిపడ్డారు. ఇంటర్నెట్ ను బంద్ చేసి అరెస్టులు చేశారని ఈటల అన్నారు.

ఇక ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి చూపిస్తున్న నిజస్వరూపం ఇది అన్నారు. సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు.నీల గతాన్ని అవలోకనం చేసుకోవాలన్నారు. కంచే చేను మేసిన చందంగా ప్రజల భూములు లాక్కుని మల్టీనేషనల్ కంపెకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఏం అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు లగచర్ల కు వెళ్తే అహ్వానం పలికిన పోలీసులు ఎంపీ డీకే అరుణ వెళ్తే అడ్డుకున్నారని మండిపడ్డారు. దందాల కోసమే హైడ్రాను సృష్టించారని, ప్రజల భూములు, ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు.

కాగా, గతంలో వైఎస్‌ఆర్‌సీపీ, నిన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాలలో ఏం జరిగిందో తెలుసు. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా పనిష్మెంట్ తప్పదన్నారు. గత ప్రభుత్వంలో భూసేకరణకు వస్తే తన్నితరమండి అని దుర్మార్గంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు మేము వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. మల్టీనేషనల్ కంపెనీలకు విద్యుత్ పై రాయితీ, ట్యాక్సీల రాయితీ, బ్యాంకుల నుంచి అతి తక్కువకే రుణాలు ఇస్తుంటే ఈ పేద రైతుల నుంచి భుములు చౌకకు కొట్టివేసే పనులు ఎందుకు ఈటల రాజేందర్ అని ప్రశ్నించారు.

Read Also: Increase Hemoglobin : ఆ పదార్థాలు తింటే… 10 రోజుల్లో రక్తం పెరగడం ప్రారంభమవుతుంది..!