Site icon HashtagU Telugu

14 Year Software Engineer : 14 ఏళ్లకే స్పేస్‌ఎక్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాడు

14 Year Software Engineer

14 Year Software Engineer

14 Year Software Engineer : 14 ఏళ్ల  బంగ్లాదేశ్ సంతతి కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయ్యాడు.. 

అది కూడా అలాంటి ఇలాంటి కంపెనీలో కాదు.. 

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) లో!!

SpaceX కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ గా చేరేందుకు రెడీ అవుతున్న ఆ బాలుడి పేరు కైరాన్ క్వాజీ (Kairan Quazi).

14 ఏళ్ళ ఏజ్ లో స్టూడెంట్స్ ఎలా ఉంటారో మనకు తెలుసు.. ఏదైనా అచీవ్ మెంట్ సాధించాలంటే కనీసం 20 ఏళ్లయినా రావాలనే ఒపీనియన్ చాలామందిలో ఉంటుంది. కానీ అలాంటి సిద్ధాంతాలన్నీ తప్పు అని 14 ఏళ్ల కైరాన్ క్వాజీ(14 Year Software Engineer) నిరూపించాడు. అతడు ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాంటాక్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాడు. ఈక్రమంలో స్పేస్‌ ఎక్స్ కు చెందిన స్టార్‌లింక్ ఇంజనీరింగ్ బృందంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ జాబ్స్ ఉన్నాయని తెలియడంతో అప్లై చేశాడు. స్పేస్‌ఎక్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో పాస్ అయ్యాడు. టెక్నికల్ రౌండ్ లో అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కైరాన్ క్వాజీ గడగడా ఆన్సర్స్ చెప్పాడు. దీంతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి కావడానికి ముందే.. అతడికి జాబ్ కన్ఫర్మ్ అయింది. త్వరలో ఇంజనీరింగ్ పూర్తయితే.. అతి పిన్న వయస్కుడైన అమెరికా గ్రాడ్యుయేట్‌గా కూడా అతడు చరిత్ర సృష్టిస్తాడు.

Also read : Sky Walk: అంతరిక్షంలో స్పేస్ వాక్.. చరిత్ర సృష్టించనున్న అరబ్ దేశీయుడు

జాబ్ కు సెలెక్ట్ అయ్యాక.. 

జాబ్ కు సెలెక్ట్ అయినట్టుగా గతవారం  స్పేస్‌ ఎక్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్  నుంచి సమాచారం అందగానే..  కైరాన్ క్వాజీ లింక్డ్‌ఇన్ లో ఒక పోస్ట్‌ పెట్టాడు. “నా నెక్స్ట్ స్టాప్ : SpaceX ! నేను స్టార్‌లింక్ ఇంజనీరింగ్ బృందంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరుతాను. ఆ కంపెనీ నా వయస్సును చూడలేదు.. నా పరిపక్వత, సామర్థ్యం మాత్రమే చూసింది” అని ఆ పోస్ట్‌లో రాశాడు. SpaceX నుంచి వచ్చిన జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ స్క్రీన్‌షాట్‌ను కూడా అందులో షేర్ చేశాడు. శాంటాక్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీని పొందిన తర్వాత క్వాజీ(14 Year Software Engineer) తన ఫ్యామిలీతో కలిసి స్పేస్‌ ఎక్స్ లో పనిని ప్రారంభించడానికి వాషింగ్టన్ రాష్ట్రానికి వెళ్లనున్నాడు.

Also read : Space X Satellites : అంత‌రిక్షంలో క‌ల్లోలం.. సౌర‌తుఫాను వ‌ల్ల 40 శాటిలైట్లు ధ్వంసం

క్వాజీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ .. 

క్వాజీ తొమ్మిదేళ్ల వయసులోనే మూడో తరగతిలోకి ఎంటర్ అయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఇంటెల్ ల్యాబ్స్‌లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్‌షిప్ పొందాడు. 11 సంవత్సరాల వయస్సులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో తన రీసెర్చ్ ను క్వాజీ ప్రారంభించాడు. 2022లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా నాలుగు నెలలు పనిచేశాడు. కైరాన్ తల్లి జూలియా చౌదరి క్వాజీ  వాల్ స్ట్రీట్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. ఆమె తన కుమారుడు కైరాన్‌తో కలిసి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.  కైరాన్ తండ్రి ముస్తాహిద్ క్వాజీ ఒక ఇంజనీర్.  ఆయన ఢాకాలోని మానిక్‌గంజ్‌ వాస్తవ్యుడు.

Exit mobile version