Site icon HashtagU Telugu

Elon Musk Son : కొడుకుకు భారత శాస్త్రవేత్త పేరు పెట్టుకున్న ఎలాన్ మస్క్ 

Elon Musk Son

Elon Musk Son

Elon Musk Son : ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్‌ మస్క్‌  తన కుమారుల్లో ఒకరికి ‘చంద్రశేఖర్‌’ అని పేరు పెట్టుకున్నారు. శివోన్‌ జిలిస్‌‌తో తనకు కలిగిన కుమారుడికి ‘చంద్రశేఖర్‌’గా నామకరణం చేశారు. 1983లో నోబెల్‌ బహుమతిని గెల్చుకున్న భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త  ఎస్‌.చంద్రశేఖర్‌ పేరిట ఆ పేరును పెట్టుకున్నారు. ఇటీవల బ్రిటన్‌లో ‘అంతర్జాతీయ కృత్రిమ మేధ  భద్రతా సదస్సు’లో  కలిసిన ఎలాన్ మస్క్ ఈవిషయాన్ని తనతో చెప్పారంటూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్ చేశారు.  ఈసందర్భంగా ఎలాన్‌ మస్క్‌తో దిగిన ఒక ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కెనడాకు చెందిన శివోన్ జిలిస్‌‌, మస్క్‌ మధ్య 2016లో పరిచయం ఏర్పడింది. మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌ కంపెనీలో జిలిస్ ఉద్యోగిగా చేరారు. ఈ పరిచయం రిలేషన్‌‌షిప్‌కి దారితీసింది. కొన్నేళ్లు సహజీవనంలో ఉన్న ఈ జంట 2021 నవంబరులో కవలలకు జన్మనిచ్చింది. ఈ పిల్లలకు స్ట్రైడర్‌, అజూర్‌ అనే పేర్లు పెట్టారు. ఈ పిల్లల్లో ఒకరికే ‘చంద్రశేఖర్’ అనే మిడిల్ నేమ్‌‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం న్యూరాలింక్‌‌ కంపెనీ డైరెక్టర్‌గా శివోన్‌ జిలిస్‌(Elon Musk Son) వ్యవహరిస్తున్నారు.

Also Read: Telangana Election : తెలంగాణ అసెంబ్లీ పోల్స్ నోటిఫికేషన్ విడుదల