Site icon HashtagU Telugu

X Vs Meta Vs Microsoft : మూడు “X”లు ఢీకొంటాయా ? ట్విట్టర్ “X” లోగోకు చిక్కులు వస్తాయా ?

X Vs Meta Vs Microsoft

X Vs Meta Vs Microsoft

X Vs Meta Vs Microsoft : ట్విట్టర్‌ లోగో మారిపోయింది. ఆ లోగోలో ఉన్న బ్లూ కలర్ పిట్ట ఎగిరిపోయింది. పిట్ట  ప్లేస్ లోకి “X” వచ్చి కూర్చుంది.  ఈ మార్పు తర్వాత ట్విట్టర్ పలు లీగల్ ఛాలెంజెస్ ను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. Meta, Microsoft సహా పలు కంపెనీలకు “X” అనే అక్షరంపై  ఇప్పటికే  మేధో సంపత్తి హక్కులు  (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) ఉన్నాయి. X అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ట్రేడ్‌మార్క్‌లలో ఒకటని.. ఈనేపథ్యంలో ఇప్పటికే దాన్ని బ్రాండింగ్ కోసం వినియోగిస్తున్న పలు సంస్థలు లీగల్ గా క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని(X Vs Meta Vs Microsoft) ట్రేడ్‌మార్క్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఒక్క అమెరికాలోనే X అక్షరాన్ని కవర్ చేసే దాదాపు 900 యాక్టివ్ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని వారు చెప్పారు. ఈ ట్రేడ్‌మార్క్‌ల యజమానులు.. తమ  బ్రాండ్ పేరు, లోగోలపై హక్కులను దక్కించుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also read : Theme of BRO : బ్రో మూవీ నుంచి థీమ్ రిలీజ్..థమన్ మరోసారి కుమ్మేసాడు

ఫేస్ బుక్,  మైక్రోసాఫ్ట్ దగ్గర కూడా  X ట్రేడ్‌మార్క్‌ 

మైక్రోసాఫ్ట్ కంపెనీ విషయానికి వస్తే..  2003 నుంచి దాని “Xbox వీడియో గేమ్ సిస్టమ్”కు  X అనే ట్రేడ్‌మార్క్‌ ను వాడుతోంది. ఫేస్ బుక్ (మెటా) ఇటీవల ట్విట్టర్ కు పోటీగా “థ్రెడ్‌” అనే సరికొత్త  సోషల్ మీడియా యాప్ ను రిలీజ్ చేసింది. బ్లూ అండ్ వైట్ కలర్ “X” అక్షరానికి సంబంధించిన ట్రేడ్‌మార్క్‌ను 2019లో ఫేస్ బుక్ రిజిస్టర్ చేసింది. “ఫేస్‌బుక్” పేరు ఇప్పుడు “మెటా”..  ఈ పేరును మార్చే క్రమంలో గతంలో జుకర్ బర్గ్ కు చెందిన మెటా కంపెనీ కూడా మేధో సంపత్తి (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్)తో ముడిపడిన  సవాళ్లను ఎదుర్కొంది. పెట్టుబడి సంస్థ “మెటా క్యాపిటల్”, వర్చువల్ రియాలిటీ కంపెనీ “MetaX” లు అప్పట్లో మెటాపై కేసులు వేశాయి. అయితే వాటిని ఎలాగోలా  జుకర్ బర్గ్ సెటిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కు కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఎదురు కావచ్చు.

Also read : CBN P4 Vision : చంద్ర‌బాబు మాట‌వింటే.!అంద‌రూ కోటీశ్వ‌రులే.!!