Site icon HashtagU Telugu

BC Reservations : అప్పటి వరకు స్థానిక ఎన్నికలు వద్దు: ఎమ్మెల్సీ కవిత

Elections to local bodies cannot be held without clarifying the increase in reservation for BCs

Elections to local bodies cannot be held without clarifying the increase in reservation for BCs

BC Reservations : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పారు. బీసీల జనాభా ఎంతో తెలికుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలన్నారు. అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదన్నారు కవిత. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏటా రూ. 20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని ధ్వజమెత్తారు.

Read Also: Rohit Sharma: ఓపెనర్ గానూ ప్లాప్.. రీటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్