Site icon HashtagU Telugu

Money laundering case : మహారాష్ట్ర, గుజరాత్‌లో 23 చోట్ల ఈడీ దాడులు

ED Seizes Luxury Cars

ED Seizes Luxury Cars

ED Raids : మనీలాండరింగ్‌ కేసులో మాలెగావ్‌లోని సిరాజ్ అహ్మద్ అనే వ్యాపారికి సంబంధించిన విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహారాష్ట్ర, గుజరాత్‌లోని 23 ప్రాంతాల్లో గురువారం సోదాలు చేపట్టింది. ఈ మేరకు మహారాష్ట్రలోని మాలెగావ్, నాసిక్, ముంబయి గుజరాతా్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లో తనిఖీలు చేపట్టింది. రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిపేందుకు ఆ వ్యాపారి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే సిరాజ్ నాసిక్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్లో బ్యాంకు ఖాతాలు తెరవడానికి దాదాపు డజను మంది కేవైసీ పేపర్లు, పాన్, ఆధార్ తీసుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు మొత్తం 14 బ్యాంకు ఖాతాలు తెరవగా వాటి ద్వారా 2200 లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఖాతాల ద్వారా రూ. 112 కోట్లు కాగా క్రెడిట్ కాగా, 315 డెబిట్ లావాదేవీలు గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు తాజాగా సోదాలు జరిపినట్టు వెల్లడించారు. అయితే ఎన్నికల వేళ మహారాష్ట్రలో సోదాలు జరగడం కలకలం రేపుతుంది.

Read Also: Google AI Learning : విద్యార్థుల కోసం గూగుల్ ‘లెర్న్ అబౌట్’.. ఏమిటీ ఫీచర్ ?