Site icon HashtagU Telugu

Election : జమ్మూకాశ్మీర్‌ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఈసీ..!

EC is ready to conduct assembly elections in 4 states including Jammu and Kashmir..!

EC stops result announcement of ongoing recruitment process in Haryana till poll process over

Assembly Elections: జమ్మూకశ్మీర్‌తో పాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్, హర్యానా అధికారులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు కొంతకాలంగా జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించాలా వద్దా? దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఏ శక్తీ కూడా ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన చేయడం లేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు 40 రోజులు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్-అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో 90 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాండురంగ్ మాట్లాడుతూ.. మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3తో ముగియనుంది. చివరిసారిగా 2019లో హర్యానా, మహారాష్ట్రలో అక్టోబర్ 21 న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా అక్టోబర్ 24 న కలిసి వచ్చాయి. ఆగస్టు 11-12 తేదీల్లో ఎన్నికల సంఘం హర్యానా సీఈవో పంకజ్ అగర్వాల్, రాజకీయ పార్టీలు, ఇతర ఏజెన్సీలతో సమావేశం నిర్వహించింది. కమిషన్ హర్యానాకు ఆగస్టు 25న ఎన్నికలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నవంబర్ 26వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఈసారి నవంబర్‌లో దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చు. అక్టోబర్ రెండో వారంలో మహారాష్ట్రలో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించి నవంబర్ 20లోగా ఫలితాలు ప్రకటించాలి.

Read Also: Hair Fall: జుట్టు రాలే సమస్య తగ్గాలంటే రాత్రి పూట ఇలా చేయాల్సిందే!