వీకెండ్ (Weekend) వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ (Non Veg) వండాల్సిందే. వారం అంత ఆఫీస్ లతో..ఇతర పనులతో బిజీ గా ఉండే జనాలు..ఆదివారం మాత్రం ఇంట్లో కావాల్సిన వంటకాలు చేసుకొని కడుపునిండా తింటారు. కొంతమందైతే నాన్ వెజ్ ను ఎంతో రుచిగా వండించుకొని తింటుంటారు. మరికొంతమంది మాత్రం రెస్టారెంట్స్ కు వెళ్లి నాన్ వెజ్ బిర్యానిలు లాగిస్తుంటారు. అయితే వీరంతా తినేది నిజంగా మేక/గొర్రె మాంసమేనా (Meat ) అనేది ఇప్పుడు అందర్నీ భయంలోకి పడేసింది. దీనికి కారణం బెంగుళూర్ నగరంలో చాల రెస్టారెంట్స్ కు అలాగే మటన్ షాప్స్ కు రాజస్థాన్ నుండి కుక్క మాంసాన్ని (Dogs Meat) సరఫరా చేస్తున్నారనే వార్త ఇప్పుడు బెంగుళూర్ (Bangalore) నగరవాసులను షాక్ లో పడేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
రాజస్థాన్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్కమాసం రవాణా చేస్తున్నారంటూ బెంగళూరు కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌లో హిందూ సంఘాలు ఆందోళన చేసారు. రాజస్థాన్ నుంచి ట్రైన్లలో కుక్కమాంసం తెచ్చి.. బెంగళూరులోని ప్రముఖ హోటల్స్కు సప్లయ్ చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. నెట్టింట ఈ కుక్క మాంసం వార్తలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో కర్నాటక ప్రభుత్వం కూడా స్పందించింది. శుక్రవారం రాత్రి ఈ మాంసాన్ని సీజ్ చేసినట్లు, ఫుడ్ ల్యాబొరేటరీకి మాంసం శాంపిల్స్ను పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుక్క మాంసం అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే.. అది మటనా?.. కుక్క మాంసమా? అనేది క్లారిటీ లేకుండా సోషల్ మీడియాలో మాత్రం కుక్క మాంసం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది.
Read Also : Paris Olympics : భారత్ బోణీ..తొలి పతకం అందించిన మను బాకర్