Site icon HashtagU Telugu

Twins Surgery: మెదళ్లు, తల అతుక్కుని జన్మించిన కవలలు.. ఆపరేషన్‌తో డాక్టర్లు కొత్త చరిత్ర!

Conjoined Twins

Conjoined Twins

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆశ్చర్యపోయే ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది విచిత్రమైన వ్యక్తులు ఉంటారు. విచిత్రమైన జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ఇక కొంతమందికి వంశపార్యపరంగా వ్యాధులు, ఇతర జబ్బులు లాంటి వస్తూ ఉంటాయి. వంశపార్యపరంగా వచ్చే వ్యాధులు జీవితకాలం వేధిస్తూ ఉంటాయి. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా.. ఏం వాడినా లాభం ఉండదు.

ఇక ప్రస్తుత కాలంలో కొన్ని కారణాల వల్ల పిల్లలు విచిత్రంగా పుడుతున్నారు. వింత వింత జబ్బులతో జన్మిస్తున్నారు. కవల పిల్లలు పుట్టడం సాధారణమే, కానీ కవలలు అతుక్కుని పుడుతున్నారు. తల, మెదడు అతుక్కుని జన్మిస్తున్నారు. ఇలా పుట్టినప్పుడు వారిని విడదీయడానికి చాలా కష్టతరం అవుతుంది. ఇద్దరినీ విడదీయాలంటే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. అయితే విడదీసేటప్పుడు ఏదైనా జరిగితే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందుకే ఇలాంటి కేసుల విషయంలో డాక్టర్లు కూడా రిస్క్ చేయడానికి సిద్దంగా ఉండరు. ఇలాంటి వారిని విడదీయడానికి భయపడుతూ ఉంటారు.

తాజాగా బ్రెజిల్ లో అవిభక్త కవలలు వారి తలలు, మెదళ్లు కలిసిపోయి జన్మించారు. వైద్య బాషలో ఇలా తలలు, మెదళ్లు కలిసిపోయి జన్మించడాన్ని క్రేనియోపాగస్ ట్విన్స్ అంటారు. వీరిని విడదీయడం చాలా కష్టమైన పని. డాక్టర్లు కూడా ముందుకు వచ్చేందుకు భయపడతారు. ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇద్దరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో విడదీయడం చాలా కష్టతరం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరగడం, వైద్యరంగం కూడా డెవలప్ అవ్వడంతో.. డాక్టర్లు ఎలాంటి వాటినైనా సాధించగలుగుతున్నారు.

వైద్యులు శ్రమించి ఈ అవిభక్త కవలను సక్సెస్ పుల్ గా విడదీశారు. ఆపరేషన్ ద్వారా తల, మెదళ్లను విడదీసి విజయవంతం అయ్యారు. వీరికి ఏడు శస్త్రచికిత్సలు చేశారు. చివరి రెండు శస్త్రచికిత్సలకే 33 గంటల సమయం పట్టింది. ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్ కావడంపై డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కోలుకుంటున్నారని డాక్టర్లు వివరించారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 100 మంది డాక్టర్లు పాల్గొన్నారు. పిల్లలను ఆరు నెలల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నారు. రియో డి జెనీరో నగరంలో బ్రెజిల్ వైద్యసంస్ధ అధిపతి గాబ్రియెల్ ముఫార్రెజ్ తో కలిసి డాక్టర్ నూర్, మరో ఇద్దరు సర్జన్లు ఈ ఆపరేషణ్ ను పర్యవేక్షించారు.