Site icon HashtagU Telugu

Bengal govt : బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్లు అంగీకారం

Doctors agree to talks with Bengal government

Doctors agree to talks with Bengal government

Doctors agree to talks with Bengal government: ఎటకేలకు జూనియర్ వైద్యులు బెంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. సోమవారం ఇదే చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం వైద్యులను ఆహ్వానించింది. ప్రత్యక్ష ప్రచారంపై గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. అయితే సోమవారం ఇదే ఫైనల్ ఇన్విటేషన్ అంటూ మమత ప్రభుత్వం నుంచి హెచ్చరిక రావడంతో మొత్తానికి డాక్టర్లు చర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

Read Also: KTR : సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం..కేటీఆర్‌

”గౌరవనీయులైన ముఖ్యమంత్రి మరియు మీ ప్రతినిధుల మధ్య సమావేశం కోసం మేము మిమ్మల్ని సంప్రదించడం ఇది ఐదవ మరియు చివరిసారి. ముందు రోజు మా చర్చకు అనుగుణంగా, గౌరవనీయ ముఖ్యమంత్రితో సమావేశానికి మిమ్మల్ని మరోసారి ఆహ్వానిస్తున్నాము. ఆమె కాళీఘాట్ నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరుపుతాం” అని బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వం-వైద్యుల బృందం మధ్య చర్చలు ఒక కొలిక్కి వస్తే.. వైద్య సేవల్లో సమస్యలు పోతాయి. చాలా రోజులుగా వైద్యులు నిరసనలు చేయడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 9న ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. న్యాయం చేయాలని జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా డాక్టర్లు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా చర్చలతో ఎలాంటి పురోగతి వస్తుందో చూడాలి.

Read Also: PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ