Site icon HashtagU Telugu

Diwali Safety Tips : దీపావళి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

Diwali Safety Tips

Diwali Safety Tips

దీపావళి (Diwali ) వచ్చిందంటే చాలు ఊరు , వాడ , పల్లె , పట్టణం దీపాల వెలుగుల్లో , టపాసుల మోతలతో మారుమోగిపోతుంటుంది. అయితే పండగ సందర్భంగా చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఎంతో జాగ్రత్తగా టపాసులు కాల్చాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన జీవితాంతాం అమావాస్యగా మారే ప్రమాదం ఉంది.

దీపావళి పండుగను ఆనందంతో జరుపుకునే క్రమంలో భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం. దీని ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సురక్షితంగా మరియు సుఖసంతోషంగా జరుపుకోవడానికి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వస్త్రాల ఎంపిక: దీపావళి రోజున టపాకాయలు కాల్చేటప్పుడు సింథటిక్ వస్త్రాలు మానుకుని, కాటన్ వస్ర్తాలు ధరించడం సురక్షితం. సింథటిక్ వస్త్రాలు త్వరగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.

బాణాసంచా కాల్చేక్రమంలో..చిన్న పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాకాయలు కాల్చాలి. బాణాసంచా కాల్చే ముందు సరైన స్థలంలో, సరైన రీతిలో అమర్చడం వల్ల ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.

ప్లాస్టిక్ గ్లోవ్స్: చేతులను రక్షించడానికి ప్లాస్టిక్ లేదా రబ్బరు గ్లోవ్స్ ఉపయోగించడం మంచిది.

రాకెట్‌ బాంబులు, తారాజువ్వలను కాల్చే సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేయండి. ఇవి కిటికీల్లో నుంచి లోపలికి వచ్చే ప్రమాదం ఉంటుంది.

భారీ శబ్దాలు: చాలా పెద్ద శబ్దం చేసే టపాకాయలను అతి జాగ్రత్తగా వాడాలి. అవి వృద్ధులు, జంతువులకు భయాన్ని కలిగిస్తాయి. కనీసం బహిరంగ ప్రదేశాల్లో శబ్దం తక్కువగా ఉండే టపాకాయలను కాల్చడం మంచిది. అలాగే తప్పనిసరిగా నీళ్లు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం నీళ్లు లేదా ఇసుకను వాడేలా చూసుకోవాలి.

టపాకాయల వల్ల వచ్చిన చెత్తను అనారోగ్యకరంగా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా, సముచిత రీతిలో శుభ్రం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందంగా జరుపుకోగలరు.

Read Also : Gum Care : వృద్ధుల చిగుళ్లను ఎలా బలోపేతం చేయాలి? ఆహారంలో ఏయే పదార్థాలు చేర్చుకోవాలి..!