Sandhya Theater Incident : ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలపాలైన విషయం తెలిసిందే. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు.
రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలన్నారు. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య సీఎం నియమించారు. సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ కోరాం. రేపు లేదంటే ఎల్లుండి సీఎం రేవంత్‌రెడ్డి కలుస్తాం. అల్లు అర్జున్‌ను కూడా కలుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తా. రేవతి కుటుంబం వినోదం కోసం థియేటర్‌కు వెళ్లారు. కావాలని ఎవరైనా ఇలా చేస్తారా..? అని దిల్ రాజు అన్నారు.
రేవతి భర్త భాస్కర్ నీ ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటాను..FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాం..ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి… భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటాం..శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుంది..అని దిల్ రాజు అన్నారు. కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నేడు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజరుకాగా.. దాదాపు రెండున్నర గంటల పాటు అతడిని పోలీసులు విచారించారు.
Read Also: WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్