Billionaire Businessman-Labour Grandson : వేల కోట్ల అధిపతి మనవడు లేబర్ గా మారాడు.. ఎందుకు ?

Billionaire Businessman-Labour Grandson : ఆయన కంపెనీ విలువ 12 వేల కోట్లు.. ఆయన డైమండ్ సిటీ సూరత్‌కు చెందిన డైమండ్ బడా  వ్యాపారవేత్త..

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 10:22 AM IST

Billionaire Businessman-Labour Grandson : ఆయన కంపెనీ విలువ 12 వేల కోట్లు.. 

ఆయన డైమండ్ సిటీ సూరత్‌కు చెందిన డైమండ్ బడా  వ్యాపారవేత్త..

దీపావళి బోనస్‌గా తన డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు కార్లు, ఇళ్లు, నగలు బహుమతిగా ఇచ్చిన ఘనత ఆయనకు ఉంది.. 

ఇంతటి ఖ్యాతి ఉన్న సావ్‌జీభాయ్ ధోలాకియా మనవడు రూవిన్ ధోలాకియా ఒక కూలీగా మారాడు..  

బట్టల షాపులో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు..

హోటల్‌లో వెయిటర్ గా సర్వీస్ చేస్తున్నాడు..  

అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సును పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తన మనవడితో బిజినెస్ తైకూన్  సావ్‌జీభాయ్ ధోలాకియా ఎందుకీ పనులు చేయిస్తున్నారు ?

Also read : Affordable Electric Bicycles : 16వేలకే ఎన్నో ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ సైకిల్‌ !

గుజరాత్ వ్యాపారవేత్త సావ్జీ భాయ్ ధోలాకియా చాలా ఫేమస్. వజ్రాల వ్యాపారంలో గుజరాత్ లోని టాప్ బిజినెస్ మ్యాన్ లలో ఆయన ఒకరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అమెరికా నుంచి గుజరాత్ కు తిరిగి వచ్చిన తన మనవడు రువిన్ ధోలాకియాకు తాతయ్య సావ్జీ భాయ్ ధోలాకియా ఒక ఆర్డర్ వేశాడు. “చెన్నైకి వెళ్లి అజ్ఞాత జీవితం గడుపు.. కూలీ పనులు చెయ్.. నువ్వు ఎవరో ఎవరికీ చెప్పొద్దు.. మొబైల్ ఫోన్ కూడా నీతో తీసుకెళ్లొద్దు. ఖర్చుల కోసం ఈ 6000 రూపాయలు ఉంచుకో ” అని తాతయ్య ఇచ్చిన ఆర్డర్ ను రువిన్ ధోలాకియా బ్లైండ్ గా   ఫాలో అయ్యాడు. ఆ విధంగా సామాన్యుడిలా రువిన్ ధోలాకియా  ఈ ఏడాది జూన్ 30న సూరత్ నుంచి చెన్నైకి  వెళ్ళాడు. చెన్నైకి చేరుకున్న తర్వాత రువిన్ ఉద్యోగం కోసం వెతికాడు. చాలాచోట్ల ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే రిజెక్ట్ చేశారు. కానీ చెన్నై హైకోర్టు మెట్రో సమీపంలో ఉన్న ఒక గార్మెంట్ షాపులో సేల్స్‌మెన్‌గా రువిన్ కు మొదటి జాబ్ వచ్చింది. అక్కడ అతను 9 రోజులు పనిచేశాడు. తన సేల్స్ నైపుణ్యాలను(Billionaire Businessman-Labour Grandson) మెరుగుపరుచుకున్నాడు.

Also read : Malayalam Director Siddique : నితిన్ డైరెక్టర్ కు గుండెపోటు

8 రోజుల పాటు ఓ హోటల్ లో ప్లేట్లు కడిగే పనిని రువిన్  చేశాడు. వెయిటర్‌గా కూడా సర్వ్ చేశాడు. ఆ తర్వాత హోటల్ ఉద్యోగం వదిలి 9 రోజులు వాచ్ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. గడియారం రిపేరింగ్ వర్క్స్ లో టెక్నీషియన్ కు హెల్ప్ చేశాడు. చివరగా బ్యాగ్స్ దుకాణంలో రెండు రోజులు రువిన్ కూలీ పని చేశాడు.  ఈవిధంగా 30 రోజుల చెన్నై  పర్యటనలో రువిన్.. తాను ఎవ్వరో చెప్పకుండా నాలుగు వేర్వేరు జాబ్స్ చేశాడు. రోజుకు కేవలం రూ.200 ఖర్చుతో జీవించాడు.  ఈక్రమంలో చెన్నైలోని ఓ సాధారణ  హాస్టల్‌లో రువిన్ ఉండేవాడు.  ఈ నెల రోజుల వ్యవధిలో కొన్ని సందర్భాల్లో ఒక్క పూట మాత్రమే అన్నం తినేవాడు.

Also read : Tomato : త‌గ్గుముఖం ప‌డుతున్న ట‌మాటా ధ‌ర‌లు.. ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు

అమెరికాలో బీబీఏ చేసి నేర్చుకున్న దాని కంటే ఎక్కువ పాఠాలను ఈ 30 రోజుల్లో చెన్నైలో ఒంటరిగా జీవించి నేర్చుకున్నాను అని రువిన్ అంటున్నాడు. తన తాతయ్య చెప్పి ఉండకుంటే ఇవన్నీ తాను నేర్చుకోలేకపోయేవాణ్ణి అని చెప్పాడు.  హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసిన టైంలో ఒక కస్టమర్ ఇచ్చిన  27 రూపాయల టిప్ తనకు కోటి రూపాయలకు సమానమైన  అనుభూతిని ఇచ్చిందని రువిన్ పేర్కొన్నాడు. “నేను పనిచేసిన  హోటల్ యజమాని నాకు రూ.2000 జీతం ఇచ్చేటందుకు 6 గంటల పాటు నిలబెట్టాడు. శ్రామిక జనాలను కొందరు ఓనర్లు ఇలా చూస్తుంటారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది”   అని తెలిపాడు.  మొత్తంగా నెలరోజులలో రువిన్ చిన్నచిన్న పనులు చేస్తూ రూ.8,600 సంపాదించాడు. ఈవిధముగా తాతయ్య ఆర్డర్ తో మొదలైన రువిన్ ఇంటర్న్ షిప్ జూన్ 30న మొదలై జూలై 30న ముగిసింది.