ధర్మస్థల (Dharmasthala )..మొన్నటి వరకు పవిత్ర స్థలంగా అంత మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ధర్మస్థల అంటే వివాదంతో చూస్తున్నారు. ధర్మస్థలిలో వందలాది మహిళలను చంపేశారని..బ్రతికుండగానే పూడ్చిపెట్టారనే వార్తలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది.
ధర్మస్థల, కర్ణాటక రాష్ట్రంలోని పవిత్రమైన యాత్రా స్థలం. మంజునాథేశ్వర ఆలయం(Manjunatheshwara Temple) ఉన్న ఈ ప్రాంతం లక్షలాది భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికతకు నిలయంగా పేరుగాంచింది. అయితే తాజాగా ఈ దేవస్థానం చుట్టూ సంచలన ఆరోపణలు చుట్టుముట్టాయి. ఆలయంలో వందలాది హత్యలు (Killings victims) జరిగినట్టు ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 1995 నుంచి 2014 వరకు ఆలయంలో పని చేసిన ఒక పారిశుధ్య కార్మికుడు, జులై 3న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను దాదాపు 100-300 మృతదేహాలను ఖననం చేశానని పేర్కొన్నాడు. వాటిలో బాలికలు, యువతులు ఉండేవారని, వారు లైంగిక దాడులకు, యాసిడ్ దాడులకు గురయ్యారని ఆరోపించాడు. నదీ తీరాల్లో, అడవుల్లో శవాలను పాతిపెట్టేవాడినని, తన వద్ద కొన్ని ఫోటోలు, ఆధారాలున్నాయని తెలిపాడు.
Harassment : బూతులు తిడుతూ నరకం చూపిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్
ఈ వాదనల ప్రకారం.. ఈ హత్యల వెనుక ఆలయానికి సంబంధించిన కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్టు వెల్లడించాడు. ఒకసారి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా దాడికి గురయ్యానని, తన కుటుంబంలోని బాలికపై జరిగిన దుర్మార్గం కారణంగా ధర్మస్థలం వదిలేశానని వెల్లడించాడు. అపరాధ భావనతో తిరిగి వచ్చి నిజాలు చెప్పినట్టు చెప్పడం మరింత ఉత్కంఠను రేపుతోంది. ఈ ఆరోపణలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని హత్యలు జరిగాయంటే సంబంధిత మిస్సింగ్ కేసులు బయటపడకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. అయితే గతంలో జరిగిన సౌజన్య హత్య కేసు, అనన్య భట్ మిస్సింగ్ కేసు వంటి కొన్ని ఘటనలు ఈ ఆరోపణలకు బలాన్ని ఇస్తున్నాయి. అనన్య భట్ తల్లి కోర్టులో కేసు వేసిన తర్వాత ఆ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. నదీ తీరాల్లో తవ్వకాలు, ఆధారాల సేకరణ మొదలైంది. రాజకీయ కుట్రల కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఒకవైపు ఆలయ ప్రతిష్ఠను కాపాడాలన్న భావనలు, మరోవైపు నిజాన్ని వెలికితీయాలన్న పట్టుదల మధ్య ఈ కేసు వేగంగా మలుపులు తిరుగుతోంది. నిజమెంతో మాత్రం పూర్తి విచారణ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.